కేసీఆర్.. మోడీకి అనుకూల‌మా? దాసోహ‌మా?

May 8, 2018 at 12:56 pm
modi-kcr

అవును! తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి సోష‌ల్ మీడియాలో ఇలాంటి ప్ర‌శ్న‌లే ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ , ఏపీకి చెందిన ఎన్నారైలు ఇదే ప్ర‌శ్న‌లతో సోష‌ల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలను వారు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ కేంద్రంలోని మోడీ ప‌క్ష‌మా..?  తెలుగు ప్ర‌జ‌ల ప‌క్ష‌మా? అని నిల‌దీస్తున్నా రు. విష‌యంలోకి వెళ్తే.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్న ప్ర‌భుత్వాలు, రాష్ట్రాల విష‌యంలో ఒక ర‌కంగాను, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మ‌రో ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోం ది. ముఖ్యంగా నిధుల విష‌యంలో రాష్ట్రాల హ‌క్కుల‌కు భంగం క‌లిగిస్తోంది. స‌మాఖ్య స్ఫూర్తిని పూర్తిగా దెబ్బ‌తీస్తోంది. రాష్ట్రాల‌పై పెత్త‌నం చేస్తోంది. 

 

ఇలాంటి విష‌యాల‌పై తాము పోరాడ‌తామంటూ.. కొత్త‌గా గ‌ళం విప్పిన తెలంగాణ  సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ రైతులకు సంబంధించి రెండు నెల‌ల కింద‌ట జ‌రిగిన ఓ స‌భ‌లో మాట్లాడిన కేసీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హా కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్ర‌త్యామ్నాయ పార్టీ లేనందునే ఇలా బ‌రితెగిస్తున్నా ర‌ని తానే ఆ ప్ర‌త్యామ్నాయ కూట‌మికి ప్రాణం పోస్తాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వివిధ రాష్ట్రాల సీఎంల‌ను క‌లుస్తున్నారు. సీన్ క‌ట్ చేస్తే.. గ‌డిచిన 48 గంట‌ల్లోనే కేసీఆర్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. కేంద్రంలోని మోడీ ప్ర‌బుత్వం ఆడిస్తున్న‌ట్టుగా ఆయ‌న ఆడుతున్నారా? అని అనిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్రం ఆదేశాల‌కు అనుగుణంగా ఇక్క‌డ ఆడుతున్నార‌ని తెలుస్తోంది. 

 

ఏపీ ప్ర‌యోజనాల విష‌యంలో కేంద్రంపై పోరాడుతున్న చంద్ర‌బాబు కేంద్రాన్ని మ‌రింత‌గా ఇబ్బంది పెట్టేందుకు వివిధ రాష్ట్రాల‌ను కూడ‌గ‌డుతున్నారు. ఆర్థిక సంఘం నివేదికను ఆస‌రా చేసుకుని కేంద్రంపై యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల సీఎంల‌ను ఒక్క‌టి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలోని 11 రాష్ట్రాల సీఎంల‌ను ఆయ‌న ఆహ్వానించి నిన్న చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. అయితే, దీనికి ఆయ‌న డుమ్మా కొట్టారు. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ను ఇరుకున పెట్టేలా ఆయ‌న ఓటుకు నోటు కేసు విష‌యంలో ప్ర‌భుత్వం ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై అధికారుల‌తో చ‌ర్చించారు. 

 

ఈ ప‌రిణామాలు రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. కాగా, వీట‌న్నింటి వెనుకా కేంద్రం ఉంద‌ని, ముఖ్యంగా హోం శాఖ ఆదేశాల మేర‌కే కేసీఆర్ ఇలా యూట‌ర్న్ తీసుకున్నార‌ని తాజా క‌థ‌నాలు చెబుతున్నాయి. సో.. దీనిని బ‌ట్టి కేసీఆర్ మోడీకి భ‌య‌ప‌డుతున్నాడా? అనే ప్ర‌న్న ఉద‌యిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

కేసీఆర్.. మోడీకి అనుకూల‌మా? దాసోహ‌మా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share