కేసీఆర్ ముందు అమిత్ షా కుప్పిగంతులా..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌ను టార్గెట్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీని గెలిపించేందుకు షా ప్రాంతీయ పార్టీల‌పై విరుచుకుప‌డ‌డంతో పాటు వాటిని తొక్కేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. షాకు తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ ఎప్పుడూ త‌గ‌లేదు. తాజాగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని షా ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. షా తెలంగాణ‌కు అన్ని కోట్లు ఇచ్చాం…ఇన్ని కోట్లు ఇచ్చాం అంటూ తెగ ఊగ‌దంపుడు ఉప‌న్యాసాలు బాగానే చేశారు.

ఓ జాతీయ పార్టీ అధ్య‌క్షుడి హోదాలో షా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో కేసీఆర్ ఊరుకుంటారా…వెంట‌నే బుధ‌వారం ప్రెస్‌మీట్ షాను ఓ ఆటాడుకున్నారు. అమిత్ షాను భ్ర‌మిత్ షాతో పోల్చారు. అమిత్‌షాలు…భ్రమిత్‌షాలు… నల్గొండ చౌరస్తాలో పాములాట పెడితే గెలుస్తారా ? అని కేసీఆర్ సెటైర్ల‌తో కూడిన ప్ర‌శ్న సంధించారు. ఈ ప్ర‌శ్న‌కు అమిత్ షానే కాదు తెలంగాణ బీజేపీ నేత‌లు సైతం ఏమ‌ని ఆన్స‌ర్ ఇస్తారో కూడా తెలియ‌డం లేదు.

షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్‌ను బాగా టార్గెట్ చేస్తోన్న నేప‌థ్యంలో బుధ‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్లో విలేక‌ర్ల స‌మావేశం పెట్టిన కేసీఆర్ తెలంగాణ‌కు భారీగా నిధులు ఇచ్చామంటోన్న షా ఆ నిధుల లెక్క చెప్పాల‌ని నిల‌దీశారు. అమిత్ షా ప‌చ్చి అబ‌ద్ధాలు ఆడేస్తున్నార‌ని..ఆయ‌న చెప్పిన‌వి అన్ని నిజాలు అని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని స‌వాల్ విసిరారు. తెలంగాణ‌లో బీజేపీని అభివృద్ధి చేసుకుంటే ఎవ్వ‌రికి ఇబ్బంది లేద‌న్న కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తా ఏంటో ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని చెప్పారు.

దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది ముఖ్య‌మంత్రులు, కేంద్ర‌మంత్రులే తెలంగాణ‌ను పొగుడుతుంటే అమిత్ షా ఇలా మాట్లాడ‌డం విచిత్రంగా ఉంద‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఓ జాతీయ పార్టీకి అధ్య‌క్షుడి హోదాలో షా ఇలా మాట్లాడ‌డంతో తాను కూడా స్పందించాల్సి వ‌చ్చింద‌ని..ఈ ఈ విమ‌ర్శ‌లు ఎవ‌రు చేసినా లైట్ తీస్కొనేవాడిన‌ని కేసీఆర్ తెలిపారు. ఏదేమైనా కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో షాను సెటైర్ల‌తో ఓ రేంజ్లో ఏకిప‌డేశారు. తెలంగాణ‌లో బీజేపీ స్థాయి ఏంటో అంద‌రికి తెలుస‌ని కూడా చీప్‌గా తేల్చిప‌డేశారు.