వాళ్లతో కెసిఆర్ ప్రెండ్లీ ఫైట్‌… రహస్య ఒప్పందం కారణమా !

October 13, 2018 at 1:02 pm

తెలంగాణ‌లో జ‌రుగుతున్న‌ముంద‌స్తు ఎన్నిక‌ల చిత్రాలు గ‌మ్మ‌త్తుగా ఉంటున్నాయి. క‌ద‌న‌రంగంలో పార్టీల క‌ద‌లిక‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐలు మ‌హాకూట‌మి ఏర్పాటు దిశ‌గా క‌దులుతున్నాయి. కానీ.. ఇంకా క్లారిటీ మాత్రం లేదు. అది ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియ‌దు. ఇక ఇదే స‌మ‌యంలో అధికార టీఆర్ఎస్‌, ఎంఐఎంల మ‌ధ్య పొత్తు లేదుకానీ.. అతుక్కుపోతున్నాయి. ఆయా పార్టీల నేత‌లు ఒక‌రికొక‌రు మాట‌ల్లో స‌హ‌క‌రించుకుంటున్నారు. అధికారికంగా ఆ రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి ఒప్పందం లేదుకానీ.. అంత‌ర్గ‌తంగా మాత్రం రాసుకునిపూసుకుని ఉంటున్నాయి.

ఇక సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే చాలు మ‌జ్లిస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. త‌మ మ‌ధ్య ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుంద‌ని బ‌హిరంగంగానే చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో ఫ్రెండ్లీ ఫైట్‌ను ప‌రిచయం చేస్తున్నారు కేసీఆర్‌. అంటే ఇక్క‌డ ఇరు పార్టీల అభ్య‌ర్థులు పోటీలో ఉంటారుగానీ.. అవ‌గాహ‌న మేర‌కు ఓట్లు వేయించుకుంటార‌న్న‌మాట‌. ఈ చిత్ర‌మైన పోటీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌జ్లిస్ నేత అస‌దుద్దీన్ ఓవైసీ కూడా కేటీఆర్‌తో భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. వారిమ‌ధ్య ఏదో అవ‌గాహ‌న కుదిరింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే కేసీఆర్ మ‌ళ్లీ సీఎం అవుతార‌ని అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇందులో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు.6454_MIM TRS

సెప్టెంబ‌ర్ 6న తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్‌ ర‌ద్దు చేయ‌డం.. ఏకంగా 105మంది పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం.. ఆ మ‌రునాడే ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ను హుస్నాబాద్లో నిర్వ‌హించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇక్క‌డ గ‌మ‌నించ‌ద‌గిన విష‌యం ఏమిటంటే.. కేసీఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల్లో మ‌జ్లిస్ సీట్లు ఐదు లేవు. ప్ర‌స్తుతం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఎంఐఎంకు ఏడు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఐదింటికి కేసీఆర్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. ఆ స్థానాల్లో పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తారో లేదో కూడా తెలియ‌దు. ఒక‌వేళ ప్ర‌క‌టించినా.. బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించుతార‌నే టాక్ వినిపిస్తోంది.

అంటే.. మొత్తంగా మ‌జ్లిస్ సిట్టింగ్ స్థానాల‌న్నింటినీ మ‌ళ్లీ గెలిపించే బాధ్య‌త కేసీఆర్ తీసుకున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇందుకు త‌గిన ప్ర‌తిఫ‌లం కూడా ఆయ‌న ఆశిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40 స్థానాల్లో ముస్లింలు గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్నారు. మ‌జ్లిస్ ద్వారా వీరి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ప్ర‌తీ సీటు కూడా ఎంతో విలువైన‌ద‌ని కేసీఆర్ బాగా తెలుసు. మ‌రోవైపు కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐలు మ‌హాకూట‌మి పేరుతో దూసుకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌జ్లిస్‌ను ద‌గ్గ‌ర‌చేసుకోవ‌డ‌మ‌న్న‌ది కేసీఆర్‌కు అత్యంత కీల‌కాంశమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

వాళ్లతో కెసిఆర్ ప్రెండ్లీ ఫైట్‌… రహస్య ఒప్పందం కారణమా !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share