కేసీఆర్ వ్యూహం దెబ్బకు.. కాంగ్రెస్‌కు చెక్‌!!

September 6, 2018 at 6:08 pm

రాజకీయాల్లో తలపండిన నాయకుడిగా ఎదిగిన టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. గడిచిన నాలుగు వారాలుగా పెద్ద ఎత్తున దీనిపై కథనాలు వచ్చినా.. గప్చుప్గా ఉన్న టీఆర్ ఎస్ నాయకు లు, ప్రభుత్వ అధికారులు.. విషయాన్ని ఎక్కడా బయటకు పొక్కనివ్వలేదు. అయితే అసాధారణంగా కేసీఆర్ గురువారం తన నిర్ణయాన్ని వెల్లడించేశారు. కేవలం క్షణాల వ్యవధిలోనే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేశారు. సుదీర్ఘం గా పాత్రికేయ సమావేశం కూడా నిర్వహించారు. అయితే, కేసీఆర్ వ్యూహం ఏంటి? ఎందుకిలా అకస్మాత్తుగా సభను రద్దు చేశారు? అనేవి కీలకంగా మారాయి. నిజానికి అధికారంలో ఇంకా ఆయన దాదాపు 9 నెలల పాటు ఉండే అవకాశం ఉంది.KCR

షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే నెలలోనే ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కానీ, తొమ్మిది నెలల ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక టీఆర్ ఎస్ బాస్ వ్యూహం ఏంటి? ఇదే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఇక్కడ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ ప్రభుత్వ సానుకూల పవనాలు వీస్తున్నా యి. రెండు.. ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ పుంజుకోలేదు. ఈ రెండు కారణాలే సభకు రద్దుకు కారణమై ఉంటాయని అంటున్నారు. కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకు కూడా ఇంకా ఎన్నికలకు సమయం ఉందని భావించింది. దీంతో కేడర్పై పెద్దగా దృష్టి పెట్టాలేదు. అదేవిధంగా బీజేపీ ఇంకా తర్జన భర్జనలోనే ఉంది.

కేంద్రంలోని బీజేపీ నాయకులు కేసీఆర్తో అంటకాగుతున్నాయి. దీంతో తాము ఎటు వెళ్లాలి? అనే విషయంపై వాళ్లు కూడా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు సుప్తచేతనావస్థలో ఉన్నాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి ఇంకా రాకుండానే సీఎం సీటు కోసం నిన్న మొన్నటి వరకు కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాహుల్ గాంధీ పర్యటన కొంత జవసత్వాలు నింపింది. ఇప్పుడిప్పుడే కార్యకర్తల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఏర్పడుతోంది. అదేవిధంగా బీజేపీ అధినేత అమిత్ షా కూడా ఇటీవలే హైదరాబాద్ వచ్చి.. పరిస్థితులను చక్కబెట్టి వెళ్లారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆచి తూచి తన నిర్ణయాన్ని అమలు చేసేశారు కేసీఆర్.uttam-kumar-reddy_647_082516102021

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవలని అన్నట్టుగా కేసీఆర్ వ్యూహాత్మకంగానే అడుగులు వేశారు. అంతేకాదు, చాలా పకడ్బందీగా అభ్యర్థులను సైతం ప్రకటించేశారు. ఈ పరిణామాలు చూసి కాంగ్రెస్, బీజేపీలు తేరుకునే సరికే కనీసం ఓ వారం రోజులు పడుతుంది. ఇక, అభ్యర్థుల ఎంపిక, బుజ్జగింపులు, రెబల్స్ అబ్బో .. ఈ రెండు పార్టీ ఎన్నికల వ్యూహంలోకి దిగేసరికి కేసీఆర్ కనీసం రెండు సార్లయినా రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చేయడం ఖాయం. మొత్తానికి కేసీఆర్ వ్యూహంలో కాంగ్రెస్, బీజేపీలు చిత్తు కావడం, తిరిగి కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టడం అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కేసీఆర్ వ్యూహం దెబ్బకు.. కాంగ్రెస్‌కు చెక్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share