కేసీఆర్ కేబినెట్ లోకి అక్బరుద్దీన్!

October 13, 2018 at 3:25 pm

అదెలా సాధ్యం? కనీసం తెరాస పార్టీతో మజ్లిస్ కు ఎన్నికల పొత్తు కూడా లేదు కదా..? అని మనకు సందేహం కలగవచ్చు. కానీ.. అంతర్గతంగా జరుగుతున్న సమాలోచనలు, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో రాబోయే సర్కారు కేసీఆర్ సారథ్యంలో ఏర్పడే అవకాశం ఉంటే గనుక.. ఖచ్చితంగా మజ్లిస్ తరఫున అక్బరుద్దీన్ కూడా చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఇది కూడా ఒక ఎజెండా పాయింటుగానే మజ్లిస్ అధినేత అసదుద్దీన్- తెరాస మంత్రి కేటీఆర్ నడుమ మంతనాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.All-India-Majlis-e-Ittehadul-Muslimeen

తెరాస ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి కూడా.. మజ్లిస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంటోంది. అదే తరహాలో.. అవతలి వైపు నుంచి కూడా వారి ప్రభుత్వానికి అనల్పమైన సహకారం అందుతోంది. అక్బరుద్దీన ప్రతి సందర్భంలోనూ సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనను ఆకాశానికెత్తేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలకు వచ్చిన కేసీఆర్.. మజ్లిస్ తో పొత్తు కుదుర్చుకోపోయినా.. స్నేహబంధం కొనసాగిస్తూ ఎన్నకలను ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. మజ్లిస్ తో పొత్తు అంటే.. కొన్ని వర్గాలకు ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున.. ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు.news-en34037

అయితే ఈసారి ఎన్నికలు పోటాపోటీగా ఉంటాయనే చాలా మంది భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో మజ్లిస్ ఎప్పటిలాగానే ఏడు సీట్లు గెలుచుకున్నప్పటికీ.. ప్రభుత్వం ఎవరిదనే విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించే వాతావరణం ఏర్పడినా ఆశ్చర్యం లేదు. కింగ్ మేకర్ పాత్రలోకే వారు వస్తే గనుక.. ప్రభుత్వంలోకి కూడా చేరడానికి అవకాశం ఉంది. అయితే తమాషా ఏంటంటే.. ఒకవేళ తెరాసకు ప్రభుత్వానికి సరిపడా పూర్తి మెజారిటీ వచ్చినా కూడా.. మరొకరి ఆసరా అవసరం లేకపోయినా కూడా.. మజ్లిస్ కు చెందిన అక్బరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడానికి వారు సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. అదే సంకేతాలు కేటీఆర్ ద్వారా అసదుద్దీన్ కు తెలియజేశారు.Akbaruddin-Owaisi-721x768

అందుకు ప్రతిగా.. మజ్లిస్ నాయకులు.. రాష్ట్రంలో ముస్లింప్రాబల్యం ఉండే ప్రతి నియోజకవర్గంలోనూ తెరాసకు అనుకూలంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. బహిరంగ ప్రచారం కాకపోయినా.. ముస్లింఓట్లను తమక అనుకూలంగా ప్రభావితం చేయాలని తెరాస కోరుతోంది. మరి వచ్చే ప్రభుత్వంలో అక్బరుద్దీన్ తొలిసారిగా మంత్రి పదవిలో కొలువుతీరుతారేమో చూడాలి.

కేసీఆర్ కేబినెట్ లోకి అక్బరుద్దీన్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share