కేసీఆర్ న్యాయం చేస్తారా..? స‌ర్ధుకోమంట‌రా..?

December 15, 2018 at 4:26 pm

రాజ‌కీయంగా అనుహ్య నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కేసీఆర్ త‌న‌కు తానే సాటి అని నిరూపించుకుంటారు. ఖ‌చ్చిత‌త్వంతో కూడిన‌ వేగ‌వంత‌మైన నిర్ణ‌యం ఆయ‌న నైజం. ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించుకు వ‌చ్చారు. ప్ర‌మాణ స్వీకారం రోజున ఎవ‌రి అంచ‌నాల‌కు చిక్క‌కుండా మ‌హమ్మ‌ద్ అలీని హోంమంత్రిగా నియ‌మిస్తూ ప్ర‌మాణాస్వీకారోత్స‌వం చేయించారు. ఇక డిప్యూటీ సీఎం పోస్ట్‌లు ఊస్ట్ అని తేల్చేశారు. మ‌రుస‌టి రోజే పార్టీ ప‌గ్గాలు త‌న‌యుడు కేటీఆర్‌కు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా కొన‌సాగిన మ‌హ‌మ్మ‌ద్ అలీకి హోంమంత్రిత్వశాఖ అప్ప‌గించి న్యాయం చేసిన కేసీఆర్‌…క‌డియం మాటెత్త‌డం లేదు..మ‌రి క‌డియంకు మంత్రివ‌ర్గంలో ఏదైనా శాఖ చూపుతారా..? లేక ఎంపీగా పంపే ఆలోచ‌న ఏమైనా ఉందా..? అనే చాలా మంది ఆ పార్టీ నేత‌లు రెండోదానికే ఎక్కువ‌గా చాయిస్ ఉంద‌ని త‌మ అభిప్రాయం వెల్ల‌డిస్తున్నారు.

ఇక డిప్యూటీ సీఎంగా స‌మ‌ర్థ‌త‌ను చాటుకున్న‌క‌డియంకు ఎంపీ సీటు క‌ట్ట‌బెడితే న్యాయం జ‌ర‌గ‌దు అన్న వాదాన అప్పుడే మొద‌లైంది. అయితే కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మార‌తాన‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. తెలంగాణ రాష్ట్రం స‌మ‌స్య‌ల‌ను..ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటాలంటే బ‌ల‌మైన, స‌మ‌ర్థ‌వంత‌మైన శ‌క్తిని పార్ల‌మెంటులో చాటాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకు పార్ల‌మెంటు కోసం గ‌ట్టి టీం కోస‌మే ఆయ‌న కొంత‌మందిని ఎంపిక చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. క‌డియం అయితే స‌బ్జెక్టు వైజ్‌గా మాట్లాడ‌గ‌లుగుతారు.. విషయాన్ని ఆక‌లింపు జేసుకోవ‌డ‌మే కాదు…వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే నైపుణ్యం ఉంద‌ని కేసీఆర్ భావిస్తున్నారని స‌మాచారం.

మ‌రి క‌డియం సంత‌`ప్తి ప‌డ‌తారా.. ?లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. వాస్త‌వానికి ఆయ‌న వ‌ర్ధ‌న్న‌పేట లేదా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ అసెంబ్లీ టికెట్‌ను త‌న కూతురుకు ఇవ్వాల‌ని…త‌న‌కు ఆ త‌ర్వాత ఏ ప‌ద‌వి ఇచ్చినా..ఇవ్వ‌కున్నా ఫ‌ర్వాలేద‌ని కేసీఆర్‌కు విన్న‌వించుకున్నార‌ట‌. అయితే కేసీఆర్ మాత్రం సిట్టింగ్‌ల‌కే సీట్లు అంటూ ముందు అనుకున్న మాట‌కే క‌ట్టుబ‌డ్డారంట‌. దీంతో క‌డియం కొంత నొచ్చుకున్నార‌ట‌. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా కూడా ప‌క్క‌న పెట్టేయ‌డంతో పార్టీలో ప్ర‌భుత్వంలో ఆయ‌న పాత్ర ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ పూర్త‌యితే గాని క‌డియం రాజకీయ భ‌విష్య‌త్‌పై క్లారిటీ రాదు..

కేసీఆర్ న్యాయం చేస్తారా..? స‌ర్ధుకోమంట‌రా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share