అందుకేనా జ‌గ‌న్‌తో కేసీఆర్ దోస్తీ..!

February 5, 2019 at 1:36 pm

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌తో దోస్తీకి సీఎం కేసీఆర్ ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఏపీలో వైఎస్ జ‌గ‌న్ హ‌వాను త‌న‌కు అనుకూలంగా మ‌ల్చుకునేందుకు త‌గిన వ్యూహాలు ర‌చిస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం స్రుష్టించ‌నుంద‌ని ఇటీవ‌ల ప‌లు జాతీయ స‌ర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈనేప‌థ్యంలో జ‌గ‌న్‌తో చెలిమి వ‌ల్ల త‌న‌కు రాజ‌కీయంగా లబ్ధి చూకూరుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్ లో టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్‌, జ‌గ‌న్ తో భేటీ అయ్యారు.

2014 ఎన్నికల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ వైకాపా జనాల్లోకి వెళ్లి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టింది. జగన్ తో పాటు పార్టీ నేతలంతా అసెంబ్లీ విడిచి రోడ్లపైనే ఉంటూ అధికారమే లక్ష్యంగా పనిచేశారు. ఇటీవ‌ల రాష్ట్రంలో జగన్ చేప‌ట్టిన పాదయాత్ర రాజ‌కీయంగా ఆయ‌న‌కు మైలేజ్ తెచ్చిపెట్టింది. ప్ర‌జ‌ల నుంచి కూడా ఆయ‌న‌కు పూర్తి మ‌ద్ద‌తు ల‌భించింది. మ‌రోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్యతిరేకత కూడా జ‌గ‌న్‌కు బాగా కలిసిస్తోంది. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో అధికార పార్టీ విఫ‌ల‌మ‌వ‌డం కూడా వైసీపీకి లాభిస్తోంది. ఈక్ర‌మంలోనే అన్నీ అనుకూలిస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే సూచనలున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి.

ఈప‌రిణామాలన్నింటినీ నిశితంగా గ‌మ‌నిస్తున్న సీఎం కేసీఆర్‌, వైఎస్ జగన్ హవాను త‌న‌కు అనుకూలంగా మార్చుకు నేందుకు పావులు క‌దుపుతున్నారు. త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ విజ‌య‌వంతం కావాలంటే జగన్ మ‌ద్ద‌తు అవసరమని భావిస్తున్నారు. ఒకవేళ థర్డ్ ఫ్రంట్ కుదరకపోతే లోక్ సభ ఎన్నికల్లో వైకాపా అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తుంద‌ని, కేం ద్రంలో ఎవరు తమకు అనుకూలిస్తే వారికి జగన్ తో కలిసి మద్దతివ్వాల‌ని కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. దీని వ‌ల్ల రెండు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల‌తో పాటు ఇరువురు నేత‌లు ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకోస‌మే వైకాపాతో దీర్ఠ‌కాల‌ బంధాన్ని కొన‌సాగించాల‌ని కేసీఆర్ ఆలోచ‌న చేస్తున్నట్లు స‌మాచారం. ఏదేమైనా కేసీఆర్ లెక్క‌లు త‌ప్పుతాయో, నిజ‌మ‌వుతాయో తేలాలంగే ఎన్నిక‌ల వ‌ర‌కు ఆగాల్సిందే..

అందుకేనా జ‌గ‌న్‌తో కేసీఆర్ దోస్తీ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share