కెసిఆర్ గులాబీ తోటలో హరీష్ కలకలం..!

May 8, 2018 at 11:32 am
kcr-harishrao-trs

అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రి హ‌రీశ్‌రావు క‌ద‌లిక‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆయ‌న రూటు స‌ప‌రేటుగా మారుతోంది. ఈనెల 5న హైద‌రాబాద్‌కు వ‌చ్చిన బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీని చాటుగా హ‌రీశ్ క‌లిసార‌నే వార్త సంచ‌ల‌నం రేపుతుండ‌గానే అంత‌కుమించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన స‌మీక‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాయి. అస‌లు మంత్రి హ‌రీశ్‌రావు కు రాజ‌కీయంగా ఉచ్చు బిగించేందుకు మామ కేసీఆర్ వ్యూహం ర‌చిస్తున్నారా..?  లేక హ‌రీశ్‌రావే మామ పెత్త‌నాన్ని ప‌త‌నం చేసేందుకు ఏదైనా ప‌ధ‌కం ర‌చిస్తున్నారా..? ఈ రెండూ గాకుండా.. మంత్రి హ‌రీశ్ ద్వారా కేంద్రంతో మ‌రేదైనా ర‌హస్య ఎజెండా న‌డిపిస్తున్నారా..? అన్న‌ది ఇప్పుడు ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఇప్పుడు ఈ ప‌రిణామాలు అన్న అటు అధికార టీఆర్ఎస్‌లో, ఇటు ఇత‌ర రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర‌ ఉత్కంఠ రేపుతోంది.

 

నిజానికి మంత్రి హరీశ్‌రావు క‌ద‌లిక‌ల‌పైనే ఎందుకు ఈ చ‌ర్చ‌, ఊహాగానాలు వినిపించ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయ‌ని తెలుస్తోంది. అవేమిటో ఒక‌సారి ప‌రిశీలిస్తే ఇదే విష‌యంలో మ‌న‌కూ ఓ క్లారిటీ వ‌స్తుంది… తెలంగాణ ఉద్య‌మంలో ఆర్టీసీ కార్మికుల‌ది కీల‌క‌పాత్ర‌. అందులోనూ తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్ (టీఎంయూ) చురుకైన పాత్ర పోషించింది. ఈ సంఘానికి మంత్రి హ‌రీశ్‌రావు గౌర‌వ అధ్య‌క్షుడిగా ఉన్నారు. అయితే ఇక్క‌డే ట్విస్ట్ ఉంది.. ఈనెల టీఎంయూ సంఘం బ‌స్‌భ‌వ‌న్ ముట్ట‌డికి పిలుపునిచ్చింది. అంత‌కుముందే ఓ దిన ప‌త్రిక‌లో మంత్రి హ‌రీశ్ పీఆర్‌వో జ‌కీర్‌ బ‌స్ భ‌వ‌న్ ముట్ట‌డిపై క‌థ‌నం రాశారు. అందులో టీఆర్ఎస్ పాల‌న‌ను మేడిపండుతో పోల్చ‌డం గ‌మ‌నార్హం. 

 

అయితే మంత్రి హ‌రీశ్ అనుమ‌తి లేకుండానే పీఆర్‌వో ఈ ఆర్టిక‌ల్ రాశారా..? అన్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న‌. ఇదిలా ఉండ‌గా.. ఆ క‌థ‌నం రాసిన పీఆర్‌వోను బాధ్య‌త‌ల నుంచి తొల‌గించారు. అయితే ఆ ఉద్యోగం ఊడిపోయిన పీఆర్‌వో త‌ర్వాత వెంట‌నే సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ సీఎల్ రాజం ప్రారంభించిన విజ‌య‌క్రాంతి ప‌త్రిక‌లో ప్ర‌ధాన ప్ర‌తినిధిగా చేర‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మ‌రో గ‌మ‌నించ‌ద‌గిని విష‌యం ఏమిటంటే… విజ‌య‌క్రాంతి ప‌త్రిక ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రినీ మంత్రి హ‌రీరావు చాటుగా క‌లిసిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామాల‌న్నీ ఈ ఐదారు రోజుల్లోనే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇక బ‌స్‌భ‌వ‌న్ ముట్ట‌డి సందర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో టీఎంయూ నేత‌, మంత్రి హ‌రీశ్‌రావు అత్యంత స‌న్నిహితుడు అశ్వథామ‌రెడ్డి ప్ర‌భుత్వం తీరుపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను ముట్ట‌డించే ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ప‌నిచేసిన త‌మ‌లాంటి వారికే స‌భ‌లు పెట్టుకోవ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. అయితే.. మంత్రి హ‌రీశ్‌రావును బీజేపే న‌డిపిస్తుంద‌నే వాద‌న్ బ‌లంగా వినిపిస్తోంది. మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి కేంద్ర‌మంత్రిని ర‌హ‌స్యంగా క‌ల‌వ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ ప‌రిణామాలన్నీ కూడా రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల‌కు కూడా అంద‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది ఉండ‌గానే ఈ ప‌రిణామాలు రాజ‌కీయ వేడిని పెంచుతున్నాయి. 

కెసిఆర్ గులాబీ తోటలో హరీష్ కలకలం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share