జగన్ ఫోటో పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

February 11, 2019 at 2:00 pm

గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు కొడాలి నాని ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌పై జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారంపై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. టీడీపీ నాయ‌కుల‌ను ఉద్దేశిస్తూ త‌న‌దైన శైలిలో హెచ్చ‌రించారు. పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా అంటూ ఏకిపారేశారు. దీనిపై టీడీపీ నాయ‌కులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.. అస‌లు విష‌యానికి వ‌స్తే…kodali-nani-ys-jagan-612-1519267034

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ ఆదివారం ఏపీలో ప‌ర్య‌టించిన‌ సంద‌ర్బంగా క్రుష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో కొంద‌రు ప్ర‌ధాని మోడీకి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు పోస్ట‌ర్లు అతికించారు. ప‌ట్ట‌ణంలోని చాలా చోట్ల గోడలకు ఈ పోస్ట‌ర్ల‌ను అంటించారు. మోడీకి, వైసీపీ మ‌ధ్య బంధం ఉందని చాటేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఈ ప్ర‌చారాన్ని కొడాలి నాని సీరియ‌స్‌గా తీసుకున్నారు. వైసీపీ, త‌న‌పౌ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నిగ్ ఇచ్చారు.

పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫొటో, నా ఫొటో పెట్టి బ్యానర్లు వేసుకుని శునకానందం పొందడం ఏందిరా సుంటల్లారా. నాలుగేళ్ళు మోడీ సంకనాకింది ఎవరు…? నాలుగేళ్ళు కాపురం చేసింది మీరు మేం కాదు…. మోడీ ఐనా చంద్రబాబు లాంటి కేడీ అయినా మాకు ఒక్కటే… అంటూ కొడాలి నాని విరుచుకుప‌డ్డారు. మోడీకి, వైసీపీకి మ‌ధ్య సంబంధాలున్నాయ‌ని న‌మ్మించేందుకు టీడీపీ శ్రేణులే ఈ పోస్ట‌ర్ల‌ను సృష్టించి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.000000

క్రుష్ణా జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంపై అధికార పార్టీ క‌న్నేసింది. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఇక్క‌డ పాగా వేయాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. రాష్ట్రంలోనే ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు సొంత నియోజ‌క‌వ‌ర్గమైన గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉండేది. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని గ‌తంలో టీడీపీ నేత‌గా నేత‌గా ఉండేవారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈసారి ఎలాగైనా నానిని ఓడించాల‌ని టీడీపీ పావులు క‌దుపుతోంది. ఈనేప‌థ్యంలోనే అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని వినియోగించుకుంటోంది.

జగన్ ఫోటో పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share