మంత్రి కొల్లు గెలుపు క‌ష్ట‌మే..!

May 18, 2018 at 10:01 am
kollu ravindra

కృష్ణా జిల్లాలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం మ‌చిలీప‌ట్నం నుంచి 2014లో గెలుపొందిన మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గానికి చెందిన కొల్లు ర‌వీంద్ర‌కు ఇప్పుడు గెలుపు గుర్రం ఆశ‌లు స‌న్న‌బ‌డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ గ్యారెంటీనే అయినా.. గెలుపు అనేది అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇచ్చిన హామీల్లో కీల‌క‌మైన పోర్టు నిర్మాణం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కి ప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌నకు ఎదురు గాలి వీస్తోంద‌ని తాజా ప‌రిణామాలు రుజువు చేస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి కొల్లు బ‌రిలోకి దిగారు. అప్ప‌ట్లో ఆయ‌న మ‌చిలీ ప‌ట్నం పోర్టు విష‌యంలోప్ర‌ధాన హామీ ఇచ్చారు. ఇక్క‌డ మ‌త్స్య‌కార వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈయ‌న హామీకి విశేష ప్రాధాన్యం ఏర్ప‌డింది.

 

అదేవిధంగా ప‌ట్ట‌ణాన్ని పీడిస్తున్న డ్రెయినేజీ స‌మ‌స్య ప‌రిష్కారం చేస్తాన‌ని చెప్పారు. అలాగే ఇళ్ల స్థ‌లాల పంపిణీ, ప్ర‌జ‌ల కు స్వ‌చ్ఛ‌మైన కృష్ణా జ‌లాలు అందించ‌డం, బంద‌రున‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ వంటివి కీల‌క హామీలు. అయితే, వీటి విష‌యంలో కొల్లు స‌క్సెస్ కాలేక పోయారు. ప్ర‌ధానంగా బంద‌రు పోర్టు విష‌యంలో ఆయ‌న చ‌తికిల ప‌డ్డారు. పోర్టు ఏర్పాటుతో ఇక్క‌డ మ‌త్స్య‌, స‌ముద్ర ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు త‌థ్యం. ఫ‌లితంగా ఇక్క‌డి వారికి ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయి. అయితే, ఈ విష‌యంలో కొల్లు ఎంతగా ప్ర‌య‌త్నాలు చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేక‌పోయారు. దీనికి ప్ర‌ధాన అవ‌రోధంగా భూ స‌మీక‌ర‌ణ స‌మ‌స్య వెంటాడుతోంది. 

 

పోర్టుకు సంబంధించి 1550 ఎర‌కాల ప‌ట్టా భూముల సేక‌ర‌ణ అంశం కోర్టుకు వెళ్ల‌డంతో ప‌నులు నిలిచిపోయాయి. మ‌రోప క్క ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో కొల్లుకు ఈ హామీ నెర‌వేర్చ‌డం క‌నాక‌ష్టంగా మారిపోయింది. ఇక‌, 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. సామాజిక వ‌ర్గం స‌మీక‌ర‌ణ‌లో భాగంగా కొల్లుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అది కూడా రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన ఎక్పైజ్ శాఖ‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు. అయితే, ఆ శాఖ‌పై ఆయ‌న ప‌ట్టు సాధించ‌లేక‌పోయారు. ముఖ్యంగా శాఖ‌లో అవినీతిని ఆయ‌న అరిక‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. మెత‌క వైఖ‌రి కార‌ణంగా మంత్రిగా ఆయ‌న మార్కులు సాధించ‌లేక‌పోయారు. దీంతో ఆయ‌న‌ను ఆ శాఖ‌నుంచి త‌ప్పించాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం జౌళి శాఖ మంత్రిగా ప్రాధాన్యం లేని శాఖ‌ను ఏలుతున్నారు.

 

మంత్రివర్గ ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న్ను త‌ప్పించాల‌ని అనుకున్నా సామాజిక స‌మీక‌ర‌ణ‌లే ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చాయి. దీంతో చివ‌రి క్ష‌ణంలో ఆయ‌న్ను బాబు కేబినెట్‌లోనే ఉంచాల్సి వ‌చ్చింది. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి బ‌లంగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని దూకుడుతో ర‌వీంద్ర‌కు రాజ‌కీయంగా నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిస్థాయి గ్రిప్ అయితే లేదు. ఇక ప‌ట్ట‌ణంలో కీల‌క ప‌ద‌వులు మెజార్టీ ఓట‌ర్లుగా ఉన్న కాపుల‌కు ఇవ్వ‌లేద‌ని ఆ వ‌ర్గం గుర్రుగా ఉంది. ఇది కూడా ఎమ్మెల్యేకు మైన‌స్‌గా మారింది. 

 

ఇక‌, తాగు నీటి స‌మ‌స్య‌కు కూడా మంత్రి చెక్ పెట్ట‌లేక‌పోయారు. జిల్లాలో కృష్ణా న‌ది ఉన్న‌ప్ప‌టికీ.. బంద‌రు నియోజ‌క‌వ ర్గం స‌ముద్ర తీరంలో ఉండ‌డంతో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు తాగునీరు అంద‌డం క‌ష్టంగా మారిపోయింది. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు కృష్ణా నీటిని అందించేందుకు రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణం అంశాన్ని కొల్లు భుజాన వేసుకున్నారు. అయితే, నిధుల లేమితో ఈ ప‌నులు ప్రారంభం చాలా ఆల‌స్య‌మైపోయింది.  ప్ర‌స్తుతం 22 కోట్ల‌తో ప్రారంభించిన ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయి. ఏది ఎలా ఉన్నా అత్యంత కీల‌క‌మైన పోర్టు నిర్మాణ హామీ మాత్రం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో కొల్లుపై క్రీనీడ‌లు అలుముకున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ప‌రిణామం వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప‌డుతుంద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మంత్రి కొల్లు గెలుపు క‌ష్ట‌మే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share