కోమటిరెడ్డి : పంతమా? భయమా?

November 10, 2018 at 10:36 pm

అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఒకింత ఎక్కువ స్థాయిలో ఉండే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలక్షణ నాయకుడు. రాజకీయ ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడే. పీసీసీ పగ్గాలు కలిగిఉన్న వారి మీద విరుచుకు పడుతుండడం, వారి నిర్ణయాలను తప్పుపడుతుండడం, అదేవిధంగా తన అనుచర వర్గాన్ని కాపాడుకుంటుండడం ఇవన్నీ ఆయనకు అలవాటు.42554147_2266155396964425_1992053553266425856_n

ప్రస్తుత ఎన్నికల్లో మహాకూటమి రూపంలో జరుగుతున్న ప్రయత్నాలకు ఇతర పార్టీలు అలుగుతుండడం ఒక ఎత్తయితే, సొంత పార్టీ మీద కోమటిరెడ్డి అలుగుతుండడం మరో ఎత్తు. మహాకూటమిలో తెదేపా మినహా తెజస, సీపీఐ తమకు కేటాయించే సీట్ల విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉంటున్న విషయం తెలిసిందే.43291513_2272726072974024_3588543298630844416_n

ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటమ్ జారీ చేశాయి. అదే రీతిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత పార్టీ నేతలకు అల్టిమేటమ్ జారీ చేశారు. పొత్తుల్లో భాగంగా మన ఇంటి పార్టీకి నకిరేకల్ స్థానాన్ని కేటాయించనున్నారనే సమాచారంపై కోమటిరెడ్డి విరుచుకు పడుతున్నారు. నకిరేకల్ లో తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు టికెట్ కేటాయించాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు చిరుమర్తి లింగయ్య ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే హఠాత్తుగా నకిరేకల్ లో కాంగ్రెస్ కాకుండా బలం లేని పార్టీలకు కేటాయిస్తే ఎలా అని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు.CONGRESS CHIRUMARTHI LINGAIAH

ఈ విషయంలో చాలా తీవ్రంగా స్పందిస్తుండటం పట్ల పార్టీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే, తాను నల్లగొండలో పోటీచేయను అని కోమటిరెడ్డి భీష్మించుకోవడంలో అర్థమేమిటని ఆరా తీస్తున్నాయి. లింగయ్యపై ప్రేమా లేదా ఆయనకు టికెట్ రాకపోతే ఆ వర్గం ఓట్లు కోమటిరెడ్డికి పడవనే ఆందోళన ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. లింగయ్యకు టిక్కెట్ ఇప్పించాల్సిందే అనే పంతమా? లేదా, లింగయ్య సామాజిక వర్గం ఓట్లు పోతే తన నియోజకవర్గంలో దెబ్బ పడుతుందని భయమా? అనేది తేలాలి. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో వీలైనంతవరకు తమకు చెందిన వారికే అభ్యర్థిత్వాలు దక్కేటట్లు చేసుకుని, గెలిపించుకున్న తర్వాత రాజకీయంగా చక్రం తిప్పాలనే యోచనలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని కొందరు వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు.

కోమటిరెడ్డి : పంతమా? భయమా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share