మాజీ మంత్రి కొణ‌తాల దారెటు..?

January 9, 2019 at 11:24 am

ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. కొంద‌రు నేత‌లు మాత్రం ఎటువైపు వెళ్లాలో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నారు. ఏ పార్టీలో చేరాల‌నే విష‌యంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. కొద్దిరోజులుగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉంటున్న మాజీ మంత్రి కొణ‌తాల రామ‌క‌`ష్ణ ఏ పార్టీలో చేరుతారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయ‌న దారెటు అన్న విష‌యంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే… టీడీపీలోకి వెళ్లే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇదేస‌య‌మంలో ఆయ‌న క‌నుక టీడీపీలో చేరితే.. మునిగే ప‌డ‌లోకి వెళ్లిన‌ట్టేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

నిజానికి.. వైఎస్ హ‌యాంలో మంత్రిగా కొణ‌తాల రామ‌క‌`ష్ణ ప‌ని చేశారు. 2004 నుంచి 2009వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌నిచేసిన కూడా 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌జారాజ్యం పార్టీ అభ్య‌ర్థి గంటా శ్రీ‌నివాస‌రావు చేతిలో ఓట‌మిపాల‌య్యారు. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న‌ను ప్ర‌జ‌లు కూడా మ‌రిచిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా.. అనుచ‌ర‌వ‌ర్గం కూడా దాదాపుగా దూరం అయ్యింద‌నే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా చెప్పుకోవాలంటే.. అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు అనుచ‌రుల‌కు దూరం అయిన కొణ‌తాల రామ‌క‌`ష్ణ టీడీపీలో చేరినా పెద్ద‌గా ప్ర‌భావం ఏమీ ఉండ‌ద‌ని త‌మ్ముళ్లే లోలోప‌ల అనుకుంటున్నార‌ట‌.

ఇదే స‌మ‌యంలో తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న టీడీపీలో కొణ‌తాల చేరితే.. మునిగిపోయే ప‌డ‌వ‌లో ఎక్కిన‌ట్టేన‌ని సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల‌తోపాటు, ప్ర‌జ‌లూ అనుకుంటున్నారు. అయితే.. సోమ‌వారం కొణ‌తాల త‌న అనుచ‌రులు, అభిమానుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. తాను ఏ పార్టీలో చేరేది సంక్రాంతి త‌ర్వాతే చెబుతాన‌ని కొణ‌తాల చెప్పుకొచ్చారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో ప్ర‌ధాని మోడీ విఫ‌లం అయ్యార‌ని, రాష్ట్ర ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కేంద్రం వ‌మ్ము చేసింద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీకి గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని ఆయ‌న అన్నారు.

మాజీ మంత్రి కొణ‌తాల దారెటు..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share