కోట‌గిరి వార‌సుడికి అదిరిపోయే టీం… !

October 9, 2018 at 12:03 pm

విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు అంద‌రినీ నివ్వెర పోయేలా చేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్‌.. ఆదిశ‌గా వేస్తున్న అడుగులు అధికార ప‌క్షానికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నాయ‌కుల‌ను ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా నిల‌బెట్టారు. వీరు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో దూసుకుపోతున్నారు. అదేస‌మ‌యంలో త‌మ స‌త్తా కూడా చాటుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏలూరు ఎంపీ టికెట్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ ఇక్క‌డ నుంచి మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు కుమారుడు కోట‌గిరి శ్రీధ‌ర్‌ను రంగంలోకి దింపారు.

రాజ‌కీయంగా మంచి ప‌లుకుబ‌డి ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన శ్రీధ‌ర్‌కు స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో మంచి ప‌లుకుబ‌డి ఉంది. కోట‌గిరి కుటుంబం సంపాయించుకున్న మంచిత‌నం, ఆయ‌న నాడు జిల్లాలో చేసిన అభివృద్ధి, విస్తృత‌మైన ప‌రిచ‌యాలు అంతా కూడా శ్రీధ‌ర్‌కు క‌లిసి వ‌చ్చాయి. దీనికితోడు .. ఏలూరు నియోజ క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లోనూ మంచి టీం ఏర్ప‌డ‌డం శ్రీధ‌ర్‌కు క‌లిసి వ‌స్తున్న ప‌రిణామం. ఏలూరు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏలూరు, కైక‌లూరు, నూజివీడు, ఉంగుటూరు, చింత‌ల‌పూడి, పోల‌వ‌రం, దెందులూరు అసెంబ్లీ నియోజ‌వ‌క‌ర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో అత్యంత పాజిటివ్ వేవ్ ఉన్న‌వారికి ఛాన్స్ ఇచ్చారు.

ఏలూరు నుంచి ఆళ్ల‌నానిని తిరిగి లైన్‌లో పెట్టారు. ఇక్క‌డ ఈయ‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న విషయం తెలిసిందే. నాని ఎమ్మెల్సీగా ఉండ‌డంతో ఆయ‌న‌కు బ‌దులుగా మ‌ధ్యాహ్న‌పు ఈశ్వ‌రీ బ‌ల‌రాంకు సీటు ఇచ్చారు. అయితే నానియే ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థి అని భావించి.. తిరిగి ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌డంతో ఏలూరులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు వైసీపీదే అని.. వార్ వ‌న్‌సైడే అని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, కృష్ణాజిల్లా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి దూలం నాగేశ్వ‌ర‌రావును దింపారు. ఈయ‌న మాజీ సర్పంచ్, ఎలాంటి మ‌చ్చా లేకుండా రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇక్క‌డ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉండ‌డం, దీనికి తోడు టీడీపీ కేడ‌ర్ చెల్లా చెదురు అవ్వ‌డంతో వైసీపీ చాలా బ‌లంగా ఉంది.77777777777

ఇదేజిల్లాలోని నూజివీడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావుకు జ‌గ‌న్ మ‌ళ్లీ టికెట్ ఇవ్వ‌నున్నారు. ఈయ‌న దెబ్బ‌తో ఇక్క‌డ టీడీపీ క‌కావిక‌ల‌మైపోయింది. ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీసిన ఇక్క‌డి త‌మ్ముళ్ల‌ను అదుపు చేయ‌లేక‌.. చంద్ర‌బాబు చేతులు ఎత్తేయ‌డంతో ఇక్క‌డ టీడీపీయే టీడీపీని ఓడించుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీనిని వైసీపీ బాగా క్యాష్ చేసుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ భారీ మెజార్టీకి రావ‌డం ఖాయం.
ఇక‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నుంచి పుప్పాల వాసుబాబు జోరుమీదున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో.. భాగంగా జ‌గ‌న్ ఈయ‌న‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇక్క‌డ ఆయ‌న బ‌ల‌మైన అభ్య‌ర్థే.

ఇక‌, చింత‌ల‌పూడి నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి ఎలీజాను రంగంలోకి దింప‌నున్నారు. ఈయ‌న ఉన్న‌త విద్యావంతుడు, మిత‌భాషి, ప‌రిజ్ఞానం ఉన్న‌వారు కావ‌డం క‌లిసి వ‌స్తున్న అంశం. ఇక‌, ఏలూరు ఎంపీ ప‌రిధిలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరులో కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నా రు. దీంతో ఇక్క‌డ త‌న‌కు తిరుగులేద‌ని భావించిన టీడీపీ టైగ‌ర్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చ‌తికిల‌ప‌డే ప‌రిస్థితి వ‌స్తోంది. ప్ర‌భాక‌ర్‌కు గ‌త ప‌దేళ్ల‌లో ఏనాడు లేనంత వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఇక్క‌డ అబ్బ‌య్య చౌద‌రి మ‌రింత క‌ష్ట‌ప‌డితే సంచ‌ల‌నం ఖాయం. అదేవిధంగా పోల‌వ‌రంలో వ‌రుస విజ‌యాలు సాధించిన తెల్లం బాల‌రాజుకు తిరిగి అవ‌కాశం ఇవ్వ‌డమే స‌రైన ప‌ద్ధ‌త‌ని స్థానిక నాయ‌కులు చెబుతున్నారు. ఆయ‌న‌పై ఒక‌రిద్ద‌రు వ్య‌తిరేక‌త చూపుతున్నా.. దానిని లెక్క‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. మొత్తానికి కోట‌గిరి టీం.. అద‌ర‌హో!! అనే రేంజ్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

కోట‌గిరి వార‌సుడికి అదిరిపోయే టీం… !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share