కోటంరెడ్డికి షాక్‌.. రీజ‌న్ ఇదే..!

May 5, 2018 at 3:22 pm
kotam reddy

త‌న‌కు తిరుగేలేద‌ని భావించిన నెల్లూరు రూర‌ల్‌ వైసీపీ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డికి టైం అస్స‌లు క‌లిసి రావ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ఎంత‌గా మంచి పేరు తెచ్చుకోవాల‌ని చూసినా.. ఆయ‌న చేసిన కొన్ని ప‌నులు ఆయ‌న‌ను బ‌ద్నాం చేస్తున్నాయ‌ని అంటున్నారు అనుచరులు. ఒక‌ప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న కోటంరెడ్డి.. ఇప్పుడు క్లీన్ డ్యామేజ్‌గా మారార‌ని చెబుతున్నారు. దీంతో ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ ల‌భించే ఛాన్స్ కూడా ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి ఆ విష‌యం ఏంటో చూద్దాం.. నెల్లూరు కేంద్రంగా సాగిన క్రికెట్ బెట్టింగ్ వ్య‌వ‌హారం లో  కోటంరెడ్డి ఆయ‌న అనుచ‌రుల పాత్ర ఉన్న‌ట్టు గ‌త కొంత‌కాలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి దాదాపు ఏడాది కింద‌టే ఆయ‌న‌కు పోలీసుల నుంచి తాఖీదు కూడా అందింది. 

 

అయితే, ఆయ‌న దేనికీ స్పందించ‌లేదు. ఇక‌, ఇటీవ‌ల ఈ కేసు మ‌రింత ముదిరింది. జిల్లా ఎస్పీ ఈ కేసును ప్ర‌తిష్టాత్మకం గా తీసుకోవ‌డంతో కోటంరెడ్డికి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే గ‌ట్టి ఆధారాలు సేక‌రించిన పోలీసులు కోటం రెడ్డిని విచారించేందుకు స‌మాయ‌త్త‌మ‌య్యారు. ఈ ప‌రిణామంతో కోటంరెడ్డి ఇమేజ్ కి పూర్తి డ్యామేజీ ఏర్ప‌డింది. బెట్టింగ్‌ వ్యవహారంలో నోటీసులివ్వడమే కాక కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు పోలీసులు. దీనిని ఆస‌రా చేసుకున్న వైసీపీలోని ఓ వ‌ర్గం కోటంరెడ్డికి వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతోంది. ఆయ‌న క్రికెట్ బెట్టింగ్ వంటి చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల్లో పాల్గొ న్నారు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే ప్ర‌స‌క్తి ఉండ‌ద‌ని చాప‌కింద నీరులాగా ప్ర‌చారం ముమ్మ‌రం చేసింది. దీనికి టీడీపీ నేత‌లు సైతం జ‌త‌క‌లిశారు. 

 

ఫ‌లితంగా ఇప్పుడు కోటంరెడ్డి ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్న చందంగా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే కోటంరెడ్డి స‌హ‌నం కోల్పోతున్నారు. మొన్నామధ్య వైసీపీలోకి కొత్తగా వచ్చిన ఓ ముఖ్యనేత అనుయాయుడిపై అందరి ముందే కోటంరెడ్డి సీరియస్ అయ్యారట. బిగ్గరగా కేకలు వేశారని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంపై త‌న ప‌ట్టు పెంచుకునేందుకు కోటంరెడ్డి.. శ్రాయ శ‌క్తులా కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే గ‌తంలో ఒక‌సారి పాద‌యాత్ర చేసిన ఆయ‌న ఇప్పుడు తాజాగా వినూత్నంగా 365 రోజుల టార్గెట్‌తో కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు.

 

త‌ద్వారా.. ఈ సీటు వేరేవారికి ద‌క్క‌కుండా చేయాల‌ని ఆయ‌న ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రోప‌క్క ప్ర‌భుత్వం ఈయ‌న బెట్టింగ్ వ్య‌వ‌హారాన్ని సీరియస్‌గా ప‌రిగ‌ణించ‌డ‌మే కాకుండా దీనిని రాజ‌కీయంగా వాడుకునేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. మ‌రి ఈ నేప‌థ్యంలోన కోటంరెడ్డికి టికెట్ ద‌క్కే చాన్స్ ఉండ‌ద‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు . మ‌రిజ‌గ‌న్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో చూడాలి. 

కోటంరెడ్డికి షాక్‌.. రీజ‌న్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share