
చంద్రబాబుకు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దిమ్మదిరిగే షాక్ ఇవ్వబోతున్నారా..? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. నిన్నమొన్నటి వరకు కర్నూలు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమైందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ.. ఇప్పుడు ఆయన అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. తాను ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరలేదని, తాను టీడీపీ చేరుతున్నట్లు ఎప్పడూ చెప్పలేదని బాబు డబ్బా మీడియాకు ట్విస్ట్ ఇచ్చారు. అంతేగాకుండా తనకు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం ఉందని ఆయన మరో బాంబు పేల్చారు. దీంతో తమ్ముళ్లతోపాటు బాబుగారి డబ్బా మీడియా కూడా దిమ్మదిరిగిపోయింది.
కోట్ల ఇలా రూటు మార్చడానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి.. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక బాబుతో కలిసి డిన్నర్ చేయడంతో దాదాపుగా చేరడం ఖాయమనే భావించారు అందరు. కానీ.. ఇక్కడ ఆయన ఒక చిన్న మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. తనకు కర్నూలు ఎంపీ సీటుతో పాటుగా తన సతీమణి కోట్ల సుజాతమ్మకు డోన్ అసెంబ్లీ సీటు, కుమారుడు రాఘవేంద్ర రెడ్డికి ఆలూరు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోట్ల మెలికపెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. బాబు మార్క్ రాజకీయం తెలుసుకుని కోట్ల మళ్లీ వెనక్కితగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేగాకుండా.. వచ్చే ఎన్నికల్లో గెలవలేని స్థితికి చేరిపోయిన టీడీపీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఉండదనీ.. ఏపీలోకి అన్నివర్గాల మద్దతు ఉన్న వైసీపీలో చేరితేనే మంచిదని ముఖ్య అనుచరులు వారించడంతో కోట్ల రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరాలన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా.. ఇప్పటికే టీడీపీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి క`ష్ణమోహన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని బాబుకు కోట్ల రూపంలో మరో భారీ షాక్ తగిలింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందుముందు మరికొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడడం ఖాయమనే టాక్ తమ్ముళ్లలో బలంగా వినిపిస్తోంది.