మీరెంత‌కు కొన్నారు..బాబూ?

March 5, 2019 at 4:15 pm

ఎమ్మెల్యేల‌ను కొన‌డం అంటే గింటే నేనే చేయాలి.. పార్టీలు మార‌డం అంటు జ‌రిగితే నా పార్టీలోకే రావాలి.. నేను చేసేదే న్యాయం.. నేను చెప్పింది ధ‌ర్మం.. అన్న‌ట్టుంది టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హారం.. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను టీఆర్ ఎస్ స‌ర్కార్ ప్ర‌లోభాల‌కు గురి చేసి కొంటోంద‌ని ఆరోపించ‌డంపై కేటీఆర్ సీరియ‌స్‌గా స్పందించారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీ పార్టీలోకి ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వైసీపీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్న‌ప్పుడు ఎటు పోయింది మీ రాజ‌నీతి.. మీకోన్యాయం.. ప‌రుల‌కో న్యాయ‌మా అని ప్ర‌శ్నించారు.. పార్టీ మారే ఎమ్మెల్యేలు ఏదైనా ఆశించే చేరుతారో, లేక అభివ్రుద్ధి కాంక్షించే చేరుతారో వాళ్ల‌కే తెలియాలి. అంతే కాని కొన‌డం అంటూ జ‌రిగితే మీ పాల‌న‌లోనే జ‌రుగుతోంద‌ని చుర‌క‌లంటించారు..

అయినా బాబు గారూ మీరు మాత్రం మొద‌టి నుంచి టీడీపీ లోనే ఉన్నారా.. మీరు కూడా ఒక‌ప్పుడు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన‌వారే క‌దా.. మీ క‌ప్పుడు ఎంతిచ్చారు.. మ‌రి మీరు ఎంత‌కు అమ్ముడుపోయారు.. అదీ కాకుండా **మీ స‌ర్కార్ ఏర్ప‌డిన త‌ర్వాత సుమారు 23 మంది ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్నారు క‌దా సారీసారీ.. కొనుక్కున్నారు క‌దా వారికి రేటెంతిచ్చారు** అని సుటిగా ప్ర‌శ్నించారు.. మీరు **చేయి**కి **చేయి**చ్చి సైకిల్ ఎక్కొచ్చు.. మీ పార్టీ వారు మాత్రం ఎక్క‌డ‌కు పోకుండా అలాగే ఉండాల‌ని కోరుకోవ‌డం అత్యాశ కాక‌పోతే మ‌రేమంటారు నాయ‌న నారా వారు..

అదీ కాకుండా మీరిప్పుడు చేయి క‌లిపిన చేతి గుర్తు పార్టీ వారు కూడా ఆయా రాష్ర్టాల్లో బీజేపీ నుంచి మ‌రిన్ని పార్టీల నుంచి వ‌చ్చి చేరుతున్న ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను చేర్చుకుంటున్నాయి క‌దా.. మరి ఆ విష‌యాల‌ను ఏమంటారు.. దానికెలా స్పందిస్తారు.. అంత‌టా ఒకే నీతి ఉండాల‌నుకుంటే త‌ప్పులేదు కానీ నేను చేస్తే రైట్ ఇత‌రులు చేస్తే త‌ప్పు అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే ఉంటుంది త‌ప్పా ఒరిగేది ఏమీ ఉండ‌ద‌నే విష‌యం మీ లాంటి **ఐటీ** శాసించే వారికి చెప్పాల్సిన విష‌యం కాద‌నుకుంటా.. అనే రీతిలో తెలంగాణ నాయ‌కుడు చంద్రాలు సారును సూటిగా సుత్తి లేకుండా ప్ర‌శ్నించారు. చూడాలి ఈ కొనుగోళ్లు, అమ్మ‌కాల వ్యాపారంపై బాబుగారు ఎలా స్పందిస్తారో..!

మీరెంత‌కు కొన్నారు..బాబూ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share