బాబు,లోకేష్ పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

March 4, 2019 at 1:02 pm

ఐటీ గ్రిడ్‌పై తెలంగాణ రాష్ర్ట స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల కేసు విష‌య‌మై టీఆర్ ఎస్ స‌ర్కార్‌ను కావాల‌నే బ‌దునాం చేస్తున్నార‌ని చంద్ర‌బాబుపై, లోకేశ్‌పై మండిప‌డ్డారు. అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని తెలంగాణ స‌ర్కార్ ఏం చేసుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. చేసేదంతా చేసి మ‌ళ్లీ పైకెళ్లి అన‌వ‌స‌ర‌పు రాద్ధాంతం చేయ‌డం ఆ తండ్రికొడుకుల‌కే చెల్లుద్ద‌ని విమ‌ర్శించారు.. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో కూడా స్వ‌యంగా దొరికిపోయి త‌ప్పించుకోవ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నాడ‌ని చెప్పుకొచ్చారు.

అడ్డంగా బుక్క‌వ్వ‌డం, ఆ త‌ర్వాత బుకాయించ‌డం, లేదంటే భ‌య‌పెట్ట‌డం, అప్ప‌టికీ కాదంటే అన‌వ‌స‌ర‌పు రాజ‌కీయాల‌ను చొప్పించ‌డం చంద్ర‌బాబు వంటి వారికే సాధ్యం అవుతుంద‌న్నారు. ఏపీ ప్ర‌భుత్వం ల‌బ్ధిదారుల స‌మాచారాన్ని చోరీ చేసింద‌ని లోకేశ్వ‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి ఇక్క‌డ ఇచ్చిన ఫిర్యాదుపై హైద‌రాబాద్ పోలీసులు స్పందించ‌క‌పోతే ఏపీ పోలీసులు ఎలా స్పందిస్తార‌న్నారు. ఏ వ్య‌క్తి అయినా ఎక్క‌డైతే ఫిర్యాదు చేస్తాడో అక్క‌డి స్థానిక పోలీసులే కేసు విష‌య‌మై ప‌రిశోధ‌న చేస్తార‌ని, దానిని కూడా రాజకీయం చేయ‌డం బాబు కుటుంబానికే చెల్లుతుంద‌ని కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

అయినా త‌ప్పు చేయ‌ని వారు ఎప్పుడు దేనికి భ‌య‌ప‌డ‌ర‌ని, దేనినైనా స్వీక‌రించ‌డానికి, ఎక్క‌డైనా విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డానికి ముందుంటార‌ని కానీ బాబు ఎందుకు గుమ్మ‌డి కాయ‌ల దొంగ‌లు అంటే భుజాలు త‌డుముకుంటున్నాడో అర్థం కావ‌డం లేద‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని చిల్ల‌ర మ‌ల్ల‌ర వ్య‌వ‌హారాలు జ‌రిపినా ప్ర‌జ‌ల‌న్నీ గ‌మ‌నిస్తున్నార‌న్నారు. వారు చెప్పాల్సిన సంద‌ర్భంలో చెప్పాల్సిన విధంగా చెప్పే రీతిలో స‌మాధానం చెబుతార‌ని అందాక ఎదురు చూడ‌డ‌మే మ‌నం చేయాల్సిన ప‌ని అని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఘాటుగా చంద్ర‌బాబు, లోకేశ్‌బాబుపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

బాబు,లోకేష్ పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share