ల‌గడపాటిపై,ఆ ప‌త్రిక‌పై కేటీఆర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..

December 15, 2018 at 1:14 pm

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటిపై ప‌రోక్షంగా సెటైర్లు వేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కు వంత‌పాడే మీడియాపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌పై కేటీఆర్ త‌న‌దైన శైలిలో ఏకిపారేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు వారం రోజుల ముందు ప‌లు ప‌త్రిక‌లు వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఓ ప‌త్రిక ఎడిట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి స‌ర్వేలు చేసి, టీఆర్ఎస్‌కు 35స్థానాలు, కాంగ్రెస్ నేత‌`త్వంలోని ప్ర‌జాకూట‌మి 65సీట్లు సాధిస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇదే స‌మ‌యంలో ఆ రెండు పార్టీల‌కు కూడా ప్ల‌స్ ఆర్ మైన‌స్ టెన్‌గా ల‌గ‌డ‌పాటి సెల‌విచ్చారు. అయితే.. ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌కు కొన్ని ప‌త్రిక‌లు ముఖ్యంగా చంద్ర‌బాబుకు వంత‌పాడే ప‌త్రిక అమిత ప్రాధాన్యం ఇచ్చిన విష‌యం తెలిసిందే. దాదాపుగా తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌జాకూట‌మి గెలుస్తుంద‌ని ఆ ప‌త్రిక‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ..అవ‌న్నీ త‌ల‌కిందులైన విష‌యం తెలిసిందే.

దీనిపై ఓ ప‌త్రిక ఎడిట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ ఆస‌క్తిక‌రంగా స‌మాధానం చెప్పారు. “ దేశంలోని అన్ని మీడియా సంస్థ‌లు టీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని చెప్పాయి. కానీ.. ఓ ప‌త్రిక‌ ఓ వ్య‌క్తి చెప్పిన విష‌యానికి అమిత ప్రాధాన్యం ఇచ్చి.. ఆయ‌నేదో పోతులూరి వీర‌బ్ర‌హ్మంలాగా.. భ‌విష్య‌త్‌ను ముందే ఊహించిన దార్శ‌నికుడిలాగా చూపించారు. ఆయ‌న చెప్పింది అయిపోతుంద‌ని చెప్పారు“ అని కేటీఆర్ ప‌రోక్షంగా ల‌గ‌డ‌పాటిని, ఆయ‌న‌ను నెత్తినెత్తుకున్న ఆ ప‌త్రిక‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ల‌గడపాటిపై,ఆ ప‌త్రిక‌పై కేటీఆర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share