కుమారస్వామి సంచలన ప్రకటన అంత నాన్న కోసమే చేశా

May 17, 2018 at 11:41 am
karnataka-kumaraswamy

నాన్న‌కోసం జేడీఎస్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి పెద్ద ఆఫ‌రే వ‌దులుకున్నారు. గ‌తంలో తాను తీసుకున్న నిర్ణ‌యంతో నాన్న‌కు మ‌చ్చ తెచ్చాన‌నీ, ఇప్పుడా ప‌రిస్థితి రాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే ఆ ఆఫ‌ర్‌ను వ‌దులుకున్న‌ట్లు చెప్పారు. ఇంత‌కీ జేడీఎస్ అధినేత‌, మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవెగౌడ‌కు త‌న‌యుడు కుమార‌స్వాతి తెచ్చిన ఆ మ‌చ్చేమిటి ? ఆయ‌నకు వ‌చ్చిన ఆఫ‌ర్ ఏమిట‌ని అనుకుంటున్నారా..?  అయితే ఆ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలేమిటో తెలుసుకోవాలంటే మీరు ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే. 

 

క‌ర్ణాక‌ట అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. 104 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజ‌య‌వం సాధించి, అతిపెద్ద పార్టీ అవ‌త‌రించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో విజ‌య‌వం సాధించి, రెండో స్థానంలో, 38 స్థానాల్లో గెలిచి జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఇక మ‌రో రెండు స్థానాల్లో ఇద్ద‌రు స్వ‌తంత్రులు గెలిచారు. ఇందులో ఒక‌రు బీఎస్పీ అభ్య‌ర్థి. అయితే మొద‌టి నుంచి కూడా జేడీఎస్ నేత కుమార‌స్వామి కింగ్‌మేక‌ర్ అవుతార‌ని ప‌లు ప్రీపోల్ స‌ర్వేలు చెప్పాయి. అయితే కింగ్‌మేక‌ర్ నుంచి కింగ్ అయ్యే అవ‌కాశాలు వ‌చ్చాయి. 

 

ప్ర‌భుత్వ ఏర్పాటుకు కేవ‌లం ఎనిమిది సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీ నుంచి కుమార‌స్వామికి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని ఆయ‌న విలేకరుల స‌మావేశంలో ప‌రోక్షంగా చెప్పారు. కానీ, తాను బీజేపీతో ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌లేద‌ని కుమార‌స్వామి స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ ఆయ‌న దానికి ఒప్పుకుని ఉంటే ఈ రోజు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేవార‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. నిజానికి సెక్యుల‌ర్ భావాలు క‌లిగిన జేడీఎస్  2004-2005లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డ్డాయి. 

 

ఆనాడు బీజేపీతో పొత్తుపెట్టుకుని తన తండ్రి దేవెగౌడకు మచ్చ తెచ్చానని.. ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ ఆఫ‌ర్‌ను వ‌దులుకున్న‌ట్లు కుమార‌స్వామి ప‌రోక్షంగా చెప్పారు. అంతేగాకుండా.. దేవుడిచ్చిన అవకాశాన్ని వినిగించుకుని చేసుకొని గతంలో పడిన మచ్చను చెరిపివేయాలని భావిస్తున్నట్లు ఆయ‌న‌ వెల్లడించారు. 

 

ఈ నేప‌థ్యంలోనే కుమార‌స్వామి కాంగ్రెస్ పార్టీతో క‌లిసిన‌డిచేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. కుమ‌ర‌స్వామిని ముఖ్య‌మంత్రి చేసేందుకు కూడా కాంగ్రెస్ ఒప్పుకుంది. కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మికి 117 ఎమ్మెల్యేల బ‌లం ఉంది. కానీ, ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష నేత య‌డ్యూర‌ప్ప‌కు ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం ప‌ల‌క‌డంతో కుమార‌స్వామికి చుక్కెదురైంది. కాగా, గురువారం ఉద‌యం య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

కుమారస్వామి సంచలన ప్రకటన అంత నాన్న కోసమే చేశా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share