ల‌గ‌డ‌పాటి.. గాలి స‌ర్వేల్లో ఆంత‌ర్యం ఇదే…

November 2, 2018 at 5:17 pm

ల‌గ‌డ‌పాటి.. ఇత‌నో పెద్ద జ‌గ‌డ‌పాటి.. మొత్తంగా బ్యాంకుల‌కు వేల‌కోట్ల రూపాయ‌లు బ‌కాయిప‌డిన ఘ‌నాపాఠి..! ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాలు.. త‌న స‌ర్వే మొద‌లు పెడుతారు. త‌న లెక్క‌లు చెప్పుకొస్తారు. ఆయ‌న‌గానీ.. ఆయ‌న మ‌నుషులు గానీ.. ఎక్క‌డ కూడా క్షేత్ర‌స్థాయిలో క‌న‌బ‌డ‌రు. కానీ స‌ర్వే ఫ‌లితాలు మాత్రం ల‌గ‌డ‌పాటి వెల్ల‌డిస్తారు. ఇదేలా సాధ్యం..? అనే ప్ర‌శ్న మాత్రం వేయ‌కండి. ఎందుకంటే.. ఆయ‌న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. మాట‌ల‌తో పూట గ‌డిపే రాజ‌కీయ వ్యాపార‌వేత్త‌. గ‌తంలో ఆయ‌న స‌ర్వేల‌తో ఒకాయ‌న పార్టీ పెట్టి కంగుతున్నారు పాపం..! త‌న సొంత సంస్థ‌కు, ముఖ్య‌మంత్రుల‌కు అనుగుణంగా స‌ర్వేలు వెల్ల‌డించి, ప‌బ్బం గ‌డుపుకుంటార‌ని టీ కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.LAGADAPATI_RAJ_GOPAL

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. మ‌ళ్లీ ల‌గ‌డ‌పాటి స‌ర్వేల పేరుతో జ‌నం ముందుకు వ‌స్తున్నారు. డిసెంబ‌ర్ 7న త‌న స‌ర్వే వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఓ ప‌త్రికాధిప‌తి ల‌గ‌డ‌పాటి స‌ర్వేల ఆధారంగా ఫ‌లితాల గురించి రాశార‌ట‌. ఈ విష‌యాన్ని ఆ ప‌త్రికాధిప‌తి త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పార‌ట‌. గ‌తంలోనూ ల‌గ‌డ‌పాటి స‌ర్వేల ఆధారంగా మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా పార్టీని ఏర్పాటు చేశారు. ఇక ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. చివ‌రికి దుకాణం మూసి.. చివ‌ర‌కు మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. రాజ‌కీయ‌, వ్యాపార అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి ఇంట్లో కూర్చొని స‌ర్వే చేసే వారి మాట‌లు వింటే ఇలా ఉంటుద‌న్న‌మాట‌.lagadapati-rajagopal-5058d300-0d2e-40aa-a5bb-fec314b4706-resize-750

పాపం.. ఈ దెబ్బ‌తో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి స‌ర్వేల గురించి మాట్లాడ‌డ‌మే బంద్ చేశార‌ట‌. ఇక రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందుకు ల‌గ‌డ‌పాటి కోత‌లు విని.. ఆంధ్రులు నిజమేన‌ని న‌మ్మారు. సోనియా గాంధీని తాను ప్రతి రోజూ క‌లుస్తాన‌ని, త‌న స‌ల‌హా తీసుకుంటార‌ని, రాష్ట్ర విభ‌జ‌న కానివ్వబోన‌ని గ‌తంలో చెప్పుకున్నారు ల‌గ‌డ‌పాటి. కానీ.. విభ‌జ‌న కాగానే.. ఆయ‌న మాయ‌మైపోయారు. ప్ర‌జ‌ల కంటే ఎక్కువ తానే బాధ‌ప‌డుతున్న‌ట్లు న‌టించడం ఎవ‌రు మ‌రిచిపోగ‌ల‌రు. తాజాగా.. ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయ రంగ ప్రవేశం చేస్తార‌ట‌. ఈ విష‌యాన్ని ప్రెస్‌మీట్ పెట్టిమ‌రీ చెప్పాడు. ఇక ముందు ముందు ల‌గ‌డ‌పాటివి మ‌రెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో మ‌రి.

ల‌గ‌డ‌పాటి.. గాలి స‌ర్వేల్లో ఆంత‌ర్యం ఇదే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share