‘లై’ TJ రివ్యూ

సినిమా : లై

న‌టీన‌టులు : నితిన్‌, మేఘా ఆకాష్‌, అర్జున్, ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, శ్రీ‌రామ్‌, సురేష్‌, అజ‌య్‌, పృథ్వీ, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం: యువ‌రాజ్‌
సంగీతం : మ‌ణిశ‌ర్మ‌
ఎడిటింగ్ : ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
నిర్మాత‌లు : రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌, అనీల్ సుంక‌ర‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం : హ‌ను రాఘ‌వ‌పూడి

 

లై అనే ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టి,దానికి లవ్,ఇంటెలిజెన్స్,ఎనిమిటి అనే టాగ్ లైన్ తో ఇది రొటీన్ మసాలా సినిమా కాదన్న కలరింగ్ ఇచ్చి,దానికి తోడు ట్రైలర్ ని ఓ పెద్ద బిల్డుప్ లో కట్ చేసి,హీరో మేకోవర్ ..ఆ స్టైలింగ్ పీక్స్ లో చూపించి ఆబ్బె తూచ్ ఇదంతా ట్రైలర్ లోనే సినిమాలో అంతా ‘లై’ అనిపించారు సింపుల్ గా చెప్పాలంటే.

ఎన్ని ట్రెండ్స్ మారినా,టేకింగ్ అని,స్టైలింగ్ అని మేకింగ్ అని కొత్తగా ఎన్ని పుట్టుకొచ్చినా ప్రేక్షకుడిని ఇవన్నీ థియేటర్ వరకు తీసుకు రాగలవేమో కానీ ఓ రెండుగంటల పాటు ఇవే సినిమాలో ఖచ్చితంగా కూర్చోబెట్టలేవు.ఇది సింపుల్ సినిమాటిక్ థియరీ.కథ..కథనం..స్క్రీన్ ప్లే ..అన్న బేసిక్స్ ని గాలికొదిలేసి..పై పై మెరుగులపై సినిమాని నడిపిద్దామనుకుంటే అది పిచ్చి..ఆ పిచ్చికి పరాకాష్ట ఈ లై.

పోనీ ఇదంత స్టైలిష్ గా టేకింగ్ పరంగా కొత్తపుంతలు తొక్కించిన సినిమానా అంటే..అదీ కాదు.ట్రైలర్ లో చూపించిన షాట్స్ తప్పించి..మహాభారతం ..కృష్ణుడు..అశ్వత్థామ హతః..కుంజరః అన్న ట్రైలర్ లో చూపించిన డైలాగ్ తప్ప సినిమాలో గుర్తుపెట్టుకోవడానికి ఏమి లేదు.ఆ డైలాగ్ కి బలమైన సందర్భం కూడా లేదు.

ఓ నాలుగు చందమా కథలు..ఓ అరడజను జేమ్స్ బాండ్ సినిమాల్ని మిక్సీ లో వేసి..గిర్రున తిప్పి..దానికి టిపికల్ స్క్రీన్ప్లే అన్న కలరింగ్ ఇచ్చి బయటకు తీసిన ప్రోడక్ట్ ఈ లై.ఒక్కటి మాత్రం నిజం..సినిమా నుండి బయటికొచ్చాక కూడా ప్రేక్షకుడిని అనేక ప్రశ్నలు అంతుచిక్కకుండా వేధిస్తూనే ఉంటాయి.మాక్సిమం ఇంతకంటే కంప్లికేటెడ్ గా స్క్రీన్ప్లే రాయలేరేమో.అలా రాస్తే ఇంటెలిజెన్స్ అంటారనో ఏమో తెలియదు కానీ..గోల్ ఒక్కటే..ప్రేక్షకుడికి చచ్చినా సినీమా అర్థం అవ్వకూడదు.

నాకున్న పరిజ్ఞానం ప్రకారం స్క్రీన్ ప్లే ముక్యంగా రెండు రకాలు.ఒకటి సింపుల్ కథకి కూడా ఇంటరెస్టింగ్ అండ్ టిపికల్ స్క్రీన్ప్లే తో కొత్తగా చెప్పడం.ఇక రెండోది ఓ టిపికల్ కథకి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్క్రీన్ ప్లే తో ఈజీ గా కన్వే చెయ్యడం.ఈ లై సినిమాకి మాత్రం ఓ టిపికల్ లైన్ కి అంత కంటే టిపికల్ అండ్ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే తో మొత్తం సినిమా నే అస్త వ్యస్తంగా తయారయ్యింది.

హను రాఘవపూడి తీసింది రెండే సినిమాలే అయినా ఓ చిన్న ఐడెంటిటీ ని అయితే పొందగలిగాడు.అయితే అదంతా లై అని ప్రూవ్ చేసేసుకోవడానికి ఒక్క సినిమా సరిపోయింది.పాపం ఎదో జోనర్ ని టేకప్ చేసాడు..సినిమా సగం అయ్యాక అరెరే సినిమా మొత్తం ఇదే జోనర్ అయితే బాగోదు అనుకుని రకరకాల షేడ్స్ ని రంగరించి నాకు సెపరేట్ ఐడెంటిటీ వద్దు మొర్రో అని తుడిచేసుకున్నాడు.

హీరోయిన్ పుట్టుక..అన్న ప్రాసన..చదువు..కోరికలు..గోల్స్ ..ఇలా చూపిస్తుంటే.. ఆహా సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఇలా ఎలివేట్ చేస్తున్నాడంటే సినిమా డెఫినెట్ గా బాగుండబోతోంది అన్న ఒపీనియన్ కి వస్తాం..కట్ చేస్తే అదంతా లై ..ఇది ఓ సాధారణ సినిమా.ఇందులో కూడా హీరోయిన్ పాటలకు తప్ప వేరే పనేం లేదు అని ప్రూవ్ చేసాడు.ఇలా ఒకటేమి..ఓ సీన్ లో ప్రేక్షకుడికి ఓ మంచి ఇంప్రెషన్ వచ్చేలోపే..ఆబ్బె అదంతా లై..ఇదిగో ఒరిజినల్ అంటూ చూపించాడు.

అతి కష్టం మీద..సినిమా అయ్యాక ఓ అరగంట పాటు ఏకాతంగా కూర్చొని అసలు ఈ సినిమా కథ ఏంటా అని ఆలోచిస్తే..ఇండియన్ ఆర్మీ జనరల్ కి హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అలవాటు ఉంటుంది.ఆ పెయింటింగ్ మీద వున్నా ఆర్మీ జనరల్ వేలిముద్రల్ని కొట్టెయ్యాలన్నది విల్లన్ ఐడియా.దానికి అతను ఓ కోటుని తయారు చేయించి దాని పైకి ఓ ప్రొఫషనల్ తో పెయింటింగ్ పైనున్న వేలిముద్రల్ని ట్రాన్స్ఫర్ చేయించి తీసుకోవడం అనేది విల్లన్ మిషన్..దీన్ని స్పాయిల్ చేసి ఆ విలన్ ఎవరు కనుక్కొని..అతని ఆట కట్టించడం హీరో మిషన్.క్రాస్ కొసన్స్ వెయ్యొద్దు ప్లీజ్.అతి కష్టం మీద అల్లిన కథ ఇది.

సినిమా మొత్తానికి నితిన్ స్టైలింగ్ పర్ఫెక్ట్ గా వుంది.ఆ ఒక్కటి మినహా ఇంకో డిపార్ట్మెంట్ బాగుంది అనేంతగా ఏది లేదు.అర్జున్ ని ఎంత సేపు డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చెయ్యాలన్న తాపత్రయమే తప్ప అది కథకి ఎంత వరకు హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ గాలికొదిలేశారు.హీరోయిన్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ పిచ్చెక్కిస్తుంది.సంప్రదాయంగా పిసినారిగా పెరిగిన అమ్మాయి..అమెరికా వెళ్లి..పొట్టి పొట్టి బట్టల్లో చేసే రొమాన్స్ అంత ఈజీ గా మింగుడుపడదు.

ఇదంతా చాలదు అన్నట్టు బ్రహ్మని,నారదుడిని కూడా కథలో ఇన్వొల్వె చేశారు.దానికో పిట్టకథ కూడా చెప్పారు.వాళ్లకు రకరకాల గెటప్పులులతో కామెడీ చేయించారు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు.అమెరికా లో తీసాం…రిచ్ గా ఉంటుంది అని ప్రచారం చేసినా చెప్పినంత రిచ్ నెస్ స్క్రీన్ పై కనిపించలేదు.టెక్నికల్ డిపార్ట్ ఏది సినిమాకి హెల్ప్ అవ్వలేదు.పాటలు పంటికింద రాళ్లే..మాటలు గుర్తే లేవు.మొత్తంగా తీసిన దర్శకుడు..చుసిన ప్రేక్షకుడు ఈ లై ని ఎంత తొందరగా మరచిపోతే అంత మంచిది..నిర్మాతలు మర్చిపోవడానికి కోచెమ్ టైం పడుతుంది.

 

రేటింగ్ : 1.5/5
పంచ్ లైన్ : సూపర్ హిట్ – “లై”