మహా కూటమి కథ కంచికేనా…!

January 10, 2019 at 4:25 pm

తెలంగాణలో  ప్రజాకూటమి కొనసాగింపుపై నీలి నీడలు కమ్మాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి.  అధికార టీఆర్ ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన మహాకూటమికి పెద్ద షాకే తగిలింది. కాంగ్రెస్, టీడీపీల పొత్తును ప్రజలు ఏ మాత్రం అంగీకరించలేదనే ఫలితాలు రుజువు చేశాయి.

అయితే అసెంబ్లీ ఫలితాలు వెలువడి నెల రోజులు కావొస్తున్నా నేటికి కూటమి నాయకులు ఓటమిపై సమీక్షించలేదు. ఎన్నికల ఫలితాల విశ్లేషణకు ఇంత వరకూ భాగస్వామ్య పక్షాలు సమావేశం కాలేదు. కనీసం మిత్ర పక్షాల నేతలు కూడా వ్యక్తిగతంగా కలుసుకొని తమ అభిప్రాయాలను పంచుకోలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహాకూటమి కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Naidu-k7KH--621x414@LiveMint

మహాకూటమి వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఒంటరిగా పోటీ చేసుంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని కాంగ్రెస్ లోని ఓ వర్గం గట్టిగా వాదిస్తోంది. ఇటు టీడీపీ ని ఫ్రంట్ లో కొనసాగించడంపై సీపీఐ, టీజేఎస్ లు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ మిత్రపక్షాలు పరస్పర సహాకారం కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామస్థాయిలో పరస్పరం సహాకరించుకొంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా కూటమిలోని పార్టీలు ఏ చర్య తీసుకోలేదు. కనీసం క్షేత్రస్థాయిలో ఈ పార్టీల మధ్య అవసరమైన మేరకు అవగాహన కోసం ప్రయత్నాలు కూడా జరగలేదు.ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సీపీఐ, టీజేఎస్ కూడా సహకరించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కూటమి కూలినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

మహా కూటమి కథ కంచికేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share