మహిళా పార్లమెంటుపై రోజా పగ తీర్చుకుందా?!

February 11, 2017 at 12:07 pm
Roja(1)

ఏపీ సీఎం చంద్ర‌బాబు, అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద‌రావులు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హిస్తున్న మ‌హిళా పార్ల‌మెంటు విష‌యంలో ఆది నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సంధిస్తున్న వైకాపా ఎమ్మెల్యే రోజా.. శ‌నివారం పెద్ద ర‌చ్చ సృష్టించి చ‌ర్చ‌కు దారితీసింది. మ‌హిళా పార్ల‌మెంటు ఆహ్వానం మేర‌కు శ‌నివారం ఆమె గ‌న్న‌వ‌రం విమానాశ్రయానికి వ‌చ్చారు. అక్క‌డి నుంచి పార్ల‌మెంటు జ‌రిగే మ‌హా సంగ‌మ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే, విమానాశ్ర‌యంలోనే ఆమె పోలీసుల‌పై విరుచుకుప‌డింది. బౌద్ధ గురువు ద‌లైలామా విమానం ఎక్కేందుకు వ‌స్తున్నార‌ని వెయిట్ చేయాల‌ని అన్న పోలీసుల‌పై ఒంటికాలిపై లేచిన రోజాను పోలీసులు వెంట‌నే అరెస్టు చేశారు.

అక్క‌డి నుంచి ఆమెను గుంటూరులోని అంక‌య్య‌పాలెం పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో రోజా మ‌రింత గా రెచ్చిపోయింది. తాను ప్ర‌యాణిస్తున్న పోలీస్ వాహ‌నంలోనే ఓ సెల్ఫీ వీడియోతీసుకున్న రోజా.. స్పీక‌ర్ కోడెల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శులు గుప్పించింది. చంద్ర‌బాబు, స్పీక‌ర్‌ల‌ను ఉద్దేశించి ఆడంగోళ్లా అంటూ తీవ్ర ప‌ద‌జాలం ప్ర‌యోగించింది. ఇంట్లో కూతురికి పట్టంగడుతూ.. కోడల్ని రాక్షసంగా చూసి ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా ఎలా రాక్షసంగా చూశారో మనందరమూ చూశామని” రోజా కోడెల‌పై నిప్పులు చెరిగింది.

అంతేకాదు,  సదస్సుకు రమ్మని ఆహ్వానం పంపి తీరా హాజరయ్యే సమయానికి ఎయిర్‌పోర్టు నుంచి గెస్ట్ రూమ్‌‌కు తీసుకెళ్తామని చెప్పి వెనుకదారిగుండా తీసుకెళ్తున్నారంటే స్టేషన్‌‌కు తరలిస్తున్నారంటే “నిజంగా వీళ్లు మగాళ్లా ఆడంగోళ్లా అనేది అర్థం కావట్లేదని నిప్పులు చెరిగింది. ఇక‌, మ‌రో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఏంటంటే.. ఆమెను తీసుకువెళ్తున్న పోలీసు వాహ‌నం స్పీడ్ బ్రేక‌ర్ వ‌ద్ద స్లో అవ‌డంతో హ‌ఠాత్తుగా ఆమె అందులోంచి దూకేసి.. త‌నను ర‌క్షించాల‌ని కేక‌లు పెడుతూ రోడ్ల మీద ప‌రుగులు తీసింది.

ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా రాష్ట్రం దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగా సాక్షి టీవీలో విజువ‌ల్స్ వ‌రుస పెట్టి ప్ర‌సారం కావ‌డం సంచ‌ల‌నం రేపింది. మ‌రి ఈ ప‌రిణామం.. నిజంగా కోడెల‌కు మ‌ర‌క అంటేలా చేస్తుంద‌న‌డంలో సందేహం లేద‌ని, అదేస‌మ‌యంలో రోజా క‌సి తీరింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. నెక్ట్స్ ఎడిసోడ్ ఏం ట‌నేది తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే!!

మహిళా పార్లమెంటుపై రోజా పగ తీర్చుకుందా?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share