సొంతజిల్లా రాజకీయాల్లో ‘మంచు’ కుర్రాడు!

October 22, 2018 at 10:28 am

చిత్తూరు జిల్లాలో చాలా కాలంనుంచి ఒక పుకారు ఉంది. మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు జిల్లాలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తారనేది ఆ పుకారు. అయితే వారి కుటుంబంలో ఇదమిత్థంగా పోటీ చేసేదెవరు? అనే సంగతి మాత్రం తేలలేదు. తాజా పరిణామాలను గమనిస్తున్నప్పుడు.. ఈ సస్పెన్స్ కు తెర దించుతూ.. మంచు మనోజ్.. చిత్తూరు జిల్లా రాజకీయ యవనికపైకి రాబోయే ఎన్నికల్లో అరంగేట్రం చేస్తారని అనిపిస్తోంది.Mohan-Babu-new

తన జీవితంలో కొత్త ప్రయాణం మొదలెట్టబోతున్నానని, తిరుపతికి మారుతున్నానని.. అక్కడి రాజకీయాల్లో ఉంటానని అర్థం వచ్చేలా మంచు మనోజ్ కుమార్ ట్విటర్ ద్వారా అభిమానులకు ఒక లేఖ రాశారు. అయితే ఈయన వచ్చే శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

నిజానికి మంచు మోహన్ బాబు కుటుంబానికి రాజకీయాసక్తి ఇప్పట్లో పుట్టింది కూడా కాదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రోజుల్లోనే మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఆ రకంగా వారి కుటుంబానికి రాజకీయ పునాది ఎన్నడో చాలా గట్టిగానే పడింది. ఆ తర్వాత పలు రకాలుగా మారిన తెదేపా రాజకీయాల్లో ఇమడలేక మోహన్ బాబు దూరం ఉండిపోయారు. కానీ కొన్ని సందర్భాల్లో తనకు రాజకీయ పార్టీ స్థాపించాలని ఉన్నట్లుగా ఆయన చెప్పారు కూడా.dc-Cover-dcm6kut49b5e6dtibj5ldclic5-20180831025430.Medi

కానీ గత 2014 ఎన్నికల సమయంలోనే మంచు కుటుంబం నుంచి ఒకరు చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీచేస్తారని బాగా ప్రచారం జరిగింది. మోహన్ బాబు స్కూళ్లు, కాలేజీలు అన్నీ చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. అలాగే తిరుపతిలో కూడా అంతో ఇంతో పట్టుంది. ఇక శ్రీకాళహస్తి ఆయనకు సొంత నియోజకవర్గం. ఆయన స్వగ్రామం ఆ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. రాజ్యసభ ఎంపీగా ఉండగా.. మారుమూల కుగ్రామమైన తన స్వస్థలం అభివృద్ధికి ఆయన ఎంపీ లాడ్స్ నిధులను కూడా వెచ్చించారు. గత ఎన్నికల్లో వారి అరంగేట్రం జరగలేదు గానీ.. ఈసారి ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి మంచు వారి కుటుంబం పోటీలో ఉంటుందని బలమైన ప్రచారం ఉంది.

మోహన్ బాబు కు పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చునని.. ఆయన కుమార్తె మంచు లక్ష్మి పోటీచేయచ్చునని స్థానికంగా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనోజ్ ప్రకటన చూస్తే.. శ్రీకాళహస్తి అవునో కాదో గానీ.. మొత్తానికి రాజకీయాల్లోకి వస్తున్నది మాత్రం మంచు మనోజ్ అని తెలుస్తోంది. నిజానికి చంద్రగిరిలో వారికి ఖాళీ లేదు. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బలమైన అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వదులుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఇష్టపడకపోవచ్చు. మరి శ్రీకాళహస్తి, తిరుపతిల్లో మంచు మనోజ్ దేనిని ఎంచుకుంటారనేది ఒక్కటే ఇప్పుడు సస్పెన్స్ గా మిగులుతోంది.

సొంతజిల్లా రాజకీయాల్లో ‘మంచు’ కుర్రాడు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share