డ్రగ్స్ ఉచ్చులో మీడియాధిప‌తి, 15 మంది విలేక‌ర్లు

ప్ర‌స్తుతం డ్ర‌గ్స్ ఇష్యూ టాలీవుడ్‌లో పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మంది ప్ర‌ముఖుల‌కు ఇప్ప‌టికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచార‌ణ ప్రారంభించారు. ఈ విచార‌ణ ప‌రంప‌ర‌లో బుధ‌వారం డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌ను, గురువారం సినిమాటోగ్రాఫ‌ర్ శ్యాం కె.నాయుడును విచారించిన అధికారులు శుక్ర‌వారం సుబ్బ‌రాజును విచారిస్తున్నారు.

ఇక తొలి రెండు రోజులు విచార‌ణ త‌ర్వాత సిట్ అధికారుల‌కు దిమ్మ‌తిరిగిపోయే విష‌యాలు తెలిశాయ‌ట‌. పూరీ, శ్యాం కె నాయుడును సిట్ అధికారులు ప‌దే ప‌దే ప్ర‌శ్న‌లు వేసి విసిగించ‌డంతో వారు చాలా మంది ప్ర‌ముఖుల పేర్లు కూడా బ‌య‌ట‌పెట్టిన‌ట్టు తెలుస్తోంది. వారు గోవా వెళితే త‌ప్పు లేదు..మేం వెళితే త‌ప్పా ? అని ఎదురు ప్ర‌శ్నించ‌డంతో సిట్ బృందం షాక్ అయ్యింట‌.

దీంతో వారు అంటే ఎవ‌రు ? అని అప్పుడు వారు ఓ పారిశ్రామిక‌వేత్త కం ప‌త్రికాధినేత పేరును చెప్పిన‌ట్టు తెలుస్తోంది. దీంతో సిట్ బృందం ఇప్పుడు ఆ ప‌త్రికాధినేత‌కు డ్ర‌గ్స్‌కు ఉన్న లింకుల‌ను ఆరా తీసేప‌నిలో ప‌డ్డార‌ట‌. సాక్ష్యాలు దొరికాక ఆ పత్రికాధిపతికి కూడా నోటీసు పంపించే అవకాశం లేకపోలేదని ఓ అధికారి వివరించారు.

అలాగే పూరీ, శ్యాం తాం ఎలాగూ దొరిక‌పోయాం కాబట్టి…ఈ విచార‌ణ‌లో మ‌రికొంత మంది సినీ ప్ర‌ముఖుల పేర్లు కూడా బ‌య‌ట‌పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక సిట్ అధికారుల విచార‌ణ‌లో మ‌రో డ్ర‌గ్స్ విక్రేత పియూష్‌ సెల్‌ఫోన్‌ను చూడ‌గా తెలుగు మీడియాలో వివిధ టాప్ ఛానెళ్లు, ప‌త్రిక‌ల్లో ప‌నిచేస్తోన్న 15 మంది ప్ర‌ముఖ విలేక‌ర్ల‌కు కూడా ఆయ‌న డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌నా చేసిన‌ట్టు తేలింద‌ట‌. త్వ‌ర‌లో వీరికి కూడా నోటీసులు జారీ చేసి వీరిని ఈ నెల 24 నుంచి వాచారించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పూరి, శ్యాం చెప్పిన‌ట్టు డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారిన ఆ టాప్ మీడియాధినేత ఎవ‌రు ? అన్న‌దానిపై ఇప్పుడు అధికార‌, మీడియా వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న పేరు బ‌య‌ట‌కు వ‌స్తే, మ‌రికొంత మంది టాప్ విలేక‌ర్ల పేర్లు కూడా బ‌య‌ట‌కు రానున్నాయ‌ని తెలుస్తోంది.