సెక్యూరిటీ లేకుండా ఆటోలో మెగాస్టార్ వెళ్ళింది ఎక్కడికో తెలుసా..!

May 22, 2018 at 4:16 pm
amitab-auto

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చాన్ తన కూతురు శ్వేతా బచ్చన్‌తో కలిసి ఆటోలో ప్రయాణించారు. అమితాబ్ ఏంటి ఆటోలో వెళ్ల‌డం ఏంట‌న్న సందేహం స‌హ‌జంగానే వ‌స్తుంది. స‌ర‌దాగా అమితాబ్‌కు ఆటోలో ప్ర‌యాణించాల‌న్న థాట్ రావ‌డంతో త‌న కుమార్తె శ్వేత‌తో క‌లిసి ఓ ఆటో ఎక్కి వెళ్లాడు. ఈ ఆటో ప్ర‌యాణంపై త‌న బ్లాగులో తాను ఈ రోజు పని నిమిత్తం బాగా డిమాండ్ ఉన్న ఆటోలో వెళ్లాను. ఆటో రిక్షా, ఆటో, రిక్.. మిరెలానైనా పిలవండి అని రాసుకున్నారు.

 

అలాగే ఆటోరిక్షాకు అస‌లు ఆ పేరు ఎలా వ‌చ్చిందో కూడా అమితాబ్ చెప్పారు. ఆటో రిక్షాకు ఈ పేరు  బ్రిటీషు వారి వలస ఆక్రమణ వల్ల వ‌చ్చింద‌ట‌. అయితే జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ మూలాల్లోని ఆవిష్కరణ పూర్వగాముల నుంచి కూడా ఈ పేరు వ‌చ్చింద‌న్న కొన్ని సందేహాలు, చ‌ర్చ‌లు అయితే ఉన్నాయ‌ని కూడా అమితాబ్ చెప్పారు.

 

ఈ వివ‌ర‌ణ‌లు, వాదాలు ఎలా ఉన్నా సమాచార రారాజు గూగుల్ మాత్రం జపనీస్ పదం ‘జిన్‌రిక్ష’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతోంద‌ని అమితాబ్ త‌న బ్లాగులో పేర్కొన్నాడు. ఇక అమితాబ్ షేర్ చేసిన ఫొటోల విషయానికి వస్తే.. ఇంటి ముందు ఆటో ఎక్కుతున్న ఫొటో, డ్రైవర్‌తో మాట్లాడుతున్న ఫొటోను షేర్ చేశారు. 

 

ఇక ఆటో న‌డుపుతోన్న వ్య‌క్తి తాను వేసిన ఓ ప్ర‌శ్న‌కు ఇచ్చిన ఆన్స‌ర్‌తో అమితాబ్ షాక్ అయ్యాడు. రోజులో రూ.1500 నుంచి రూ.1800 సంపాదిస్తావా అని అడిగాను. ఒక్కోసారి రూ.5000 వరకూ సంపాదిస్తానని సమాధానమివ్వ‌డంతో అమితాబ్ షాక్ అయ్యాడ‌ట‌.636625973938018378

సెక్యూరిటీ లేకుండా ఆటోలో మెగాస్టార్ వెళ్ళింది ఎక్కడికో తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share