టీడీపీలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఊహించని పరిణామం

February 18, 2017 at 5:48 am
Anam Brothers

ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీల కోసం అప్పుడే సెగ‌లు రేగాయి. ఎవ‌రికి వారు త‌మ‌కు ఎమ్మెల్సీ కావాలంటే త‌మ‌కు ఎమ్మెల్సీ కావాల‌ని పోటీప‌డుతూ అధినేత చంద్ర‌బాబును ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పోటీప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఎమ్మెల్సీ చిచ్చు రేగిన‌ట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈ వార్త పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లాలో ఆనం బ్ర‌ద‌ర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌. ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా ఆనం బ్ర‌ద‌ర్స్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట‌..ఒకే బాట అన్న‌ట్టుగా ఉంటారు. అయితే ఇప్పుడు వారిద్ద‌రి మ‌ధ్య ఎమ్మెల్సీ సీటు చిచ్చు పెట్టిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి.

చంద్ర‌బాబు ఈ ఇద్ద‌రు ఆనం బ్ర‌ద‌ర్స్‌లోను ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డికి ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ఇక త్వ‌ర‌లో జ‌రిగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కూడా రాంనారాయ‌ణ‌రెడ్డి మంత్రి రేసులో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న ఎమ్మెల్సీ రేసులో సోద‌రుడు వివేక కంటే కాస్త ముందు ఉన్నారు.

ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, వివేకా ఇద్ద‌రూ విడివిడిగా చంద్ర‌బాబును క‌లిసి సీటు త‌మ‌కే కేటాయించాల్సిందిగా కోరుతున్నారుట‌. వివేకానంద‌రెడ్డి త‌న కొడుకుకే ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే రామ‌నారాయ‌ణ‌రెడ్డి రేసులో ముందు ఉండ‌డంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రు సోద‌రుల మ‌ధ్య ఎమ్మెల్సీ సీటు చిచ్చు రేప‌డం ఖాయ‌మ‌న్న టాక్ నెల్లూరు పాలిటిక్స్‌లో వినిపిస్తోంది.

 

టీడీపీలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఊహించని పరిణామం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share