మోడీ నెత్తిన పెద్ద పిడుగు… దెబ్బ అదుర్స్

June 13, 2018 at 9:01 am

స‌ర్వేలు.. స‌ర్వేలు.. ఇంటి స‌ర్వేలు..బ‌య‌టి స‌ర్వేలు.. ఇలా ఎన్ని స‌ర్వేలు చేప‌ట్టినా క‌మ‌ల‌ద‌ళానికి మాత్రం క‌లిసిరావ‌డం లేదు. ప్ర‌తీ స‌ర్వేలోనూ ప్ర‌తికూల ఫ‌లితాలే రావ‌డంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కొద్దిరోజుల కింద‌ట‌ సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి మూడ్ ఆఫ్‌ది నేష‌న్ పేరుతో నిర్వ‌హించిన స‌ర్వేలో మోడీ ప్ర‌భ త‌గ్గింద‌నీ, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. ఆ పార్టీ వంద‌కుపైగా సీట్లు కోల్పోతుంద‌ని తేలింది. అంతేగాకుండా.. ద‌క్షిణాదిన కేవ‌లం సుమారు 18-నుంచి 22 సీట్లకే ప‌రిమితం అవుతుంద‌ని చెప్పింది. 

 

మొన్న‌టికి మొన్న ఆ పార్టీ అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన స‌ర్వేగా చెబుతున్న దానిలోనూ పార్టీకి ప్ర‌తికూలంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ పార్టీ కేవ‌లం 130 స్థానాల‌కే ప‌రిమితం అవుతుంద‌ని స‌ర్వేలో తేలిన‌ట్లు ప్ర‌చారం జరుగుతోంది. ఇలా ప్ర‌ధానిగా నాలుగేళ్ల పాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బీజేపీతోపాటు ప‌లు సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేల‌న్నీ ప్ర‌తికూలంగా ఉన్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈప‌రిణామాలు క‌మ‌లం నేత‌ల‌కు కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా.. మ‌రో స‌ర్వే పిడుగు మోడీపై ప‌డింది. అయితే ఇప్పుడు చేసింది మాత్రం పార్టీ కాదు.. ప్ర‌తిప‌క్షాలు కాదు.. స్వ‌చ్ఛంద సంస్థ‌లు అంత‌క‌న్నా కాదు..ఆర్‌బీఐ నిర్వ‌హించిన స‌ర్వే నివేదికలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. 

 

వినియోగ‌దారుల విశ్వాస స‌ర్వేలో వెల్ల‌డైన అంశాలు మోడీని తాకుతున్నాయి.  ఇక్క‌డ రెండు అంశాలు ఉన్నాయి.. మోడీ అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో ప్ర‌జ‌ల అభిప్రాయానికి.. నాలుగేళ్ల త‌ర్వాత ఉన్న ప్ర‌జ‌ల అభిప్రాయానికి చాలా తేడాలు ఉండ‌డం గమ‌నార్హం. ఆర్‌బీఐ ఈ స‌ర్వేను చెన్నై, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, ముంబాయి, న్యూఢిల్లీ, బెంగ‌ళూరు న‌గ‌ర‌లో చేప‌ట్టింది. ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నెల త‌ర్వాత నిర్వ‌హించిన స‌ర్వేతో పోల్చి చూసి, అనేక అంశాల‌ను పేర్కొంది. మొద‌ట్లో కంటే.. ఇప్పుడు వినియోగ‌దారులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌ర్వేలో పేర్కొంది. 

 

2014తో పోల్చితే.. ఇప్పుడు వినియోగ‌దారుల ఆదాయం వృద్ధి నిరాశాజ‌న‌కంగా ఉన్న‌ట్లు పేర్కొంది. గ‌త ఏడాది కంటే.. ఆర్థిక ప‌రిస్థితి బ‌ల‌హీనంగా ఉంద‌ని 48శాతం మంది చెప్ప‌గా.. 31శాతం మంది మాత్రం మెరుగైంద‌ని అభిప్రాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఇదంతా కూడా పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌భావంగా ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. ఏదేమైన వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీకి పెద్ద‌నోట్ల ర‌ద్దు దెబ్బ త‌ప్ప‌ద‌ని ఆర్‌బీఐ స‌ర్వేతో తేలిపోయింద‌ని చెబుతున్నారు. 

మోడీ నెత్తిన పెద్ద పిడుగు… దెబ్బ అదుర్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share