ఆర్కే దెబ్బ‌తో ఆర్క్‌కే అదిరిప‌డ్డాడా..!

December 4, 2017 at 2:31 pm

వైసీపీ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి దెబ్బ‌కు ఆంధ్ర‌జ్యోతి అధినేత ఆర్కే(రాధాకృష్ణ‌)కు దిమ్మ తిరిగి పోయింది!  ఆళ్ల ఇచ్చిన షాక్‌తో ఆర్కేకి ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియ‌క త‌ల ప‌ట్టుకున్నార‌ని స‌మాచారం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో క‌థ‌నాలు వండి వార్చిన ఆర్కేకి ఇప్పుడు ఆయ‌న క‌థ‌న‌మే అర్ధం కాకుండా పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే..  ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై రాష్ట్ర విప‌క్షం వైసీపీ అధినేత జగ‌న్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సమయంలో త‌న సొంత కేసుల గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావించాడ‌ని, బీజేతోపొత్తు గురించి చ‌ర్చించాడ‌ని పేర్కొంటూ ఆంధ్ర‌జ్యోతిలో క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. 

దీంతో వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే.. ఆళ్ల‌.. స‌ద‌రు క‌థ‌నాల ద్వారా జ‌గ‌న్‌ పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని ఇప్ప‌టికే విచార‌ణ‌కు స్వీక‌రించిన ధ‌ర్మాస‌నం.. గ‌తంలోనే విచార‌ణ చేప‌ట్టింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. గ‌తంలోనే ఆదేశించింది. అంతేకాదు, కోర్టుకు హాజ‌రై.. సంజాయిషీ చెప్పాల‌ని కూడా కోర్టు ఆదేశించింది.  వ్యక్తిగత హాజరులో మినహాయింపు కోరుతూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సోమ‌వారం విచారించిన హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. 

నాంపల్లి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప‌రిణామం ఆర్కేకి శ‌రాఘాత‌మేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇదిలావుంటే, ఇటీవల జరిగిన కేసు విచారణకు రాధాకృష్ణతోపాటు ఎడిటర్, పబ్లిషర్, మరికొందరు మంది ఉద్యోగులు హాజరు కాకపోవడంపై నాంపల్లి కోర్టు మండిపడిన విషయం తెలిసిందే. గ‌తంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు  వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్‌ కె.శ్రీనివాస్, పబ్లిషర్‌ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులను హైకోర్టు ఆదేశించింది. ఈ ప‌రిణామంపై ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. త‌ల బిరుసుత‌నంతో ఏం రాసినా చెల్లుతుంద‌నే ధోరణిని ప్ర‌ద‌ర్శించిన వారికి ఇదొక గుణ‌పాఠ‌మ‌ని హెచ్చ‌రించారు. మొత్తానికి ఆర్కేకి ఆళ్ల దెబ్బ షాకింగ్ ట్రీట్‌మెంట్ అంటున్నారు విశ్లేష‌కులు. 

ఆర్కే దెబ్బ‌తో ఆర్క్‌కే అదిరిప‌డ్డాడా..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share