లోకేశ్‌కు సినిమా డైలాగులే దిక్కా..!

June 6, 2018 at 3:15 pm
lokesh-dialogue

లోకేశ్‌బాబు.. రాజ‌కీయాల్లో బుడిబుడి అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడే మాట‌లు నేర్చుకుంటున్నారు.. కేవలం చంద్ర‌బాబు త‌నయుడు అన్న ఒకేఒక్క కార‌ణంతో ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. స‌మావేశాల్లోగానీ, స‌భ‌ల్లోగానీ పెద్ద‌గా మాట్లాడ‌డం ఉండ‌దు. ఇక విలేక‌రుల స‌మావేశంలోనైతే ఆయ‌న ప‌రిస్థితి మ‌రింత చిత్రంగా ఉంటుంది. విలేక‌రులు ప్ర‌శ్న‌లు వేయ‌డానికి అవ‌కాశ‌కం ఉండ‌దు.. ఆయ‌న చెప్పింది మాత్ర‌మే రాసుకుని బ‌య‌ట‌ప‌డాలి. ఒక‌వేళ ఎవ‌రైనా ప్ర‌శ్న‌లు వేస్తే.. క‌న్ఫ్యూజ‌న్‌లో ఎక్కువ కొట్టేస్తాను.. అంటూ మ‌హేశ్ చేప్పే డైలాగ్‌ను త‌ల‌పిస్తోంది లోకేశ్‌బాబు స‌మాధానం.  ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు సొంత డైలాగులు క‌రువై.. సినిమా డైలాగులే దిక్క‌య్యాయి.. ఏకంగా ప‌వ‌వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆ వైసీపీ ఎమ్మెల్యేకు తిరుగులేదా..!న్‌క‌ల్యాణ్ సినిమాలోని డైలాగుల‌ను కాపీ కొట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

అందుకే ఎక్కువ‌గా లోకేశ్‌బాబు బహిరంగ సభల్లో…ఏటా ఆస్తుల ప్రకటన సమయంలోనే విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేస్తారు త‌ప్ప రాజ‌కీయ నేప‌థ్యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడ‌డం చాలా అరుదుగా ఉంటుంది. ఒకవేళ ఏర్పాటు చేసినా.. తాను చెప్ప‌ద‌ల్చుకున్న‌ది మాత్ర‌మే చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం ఆయ‌నకు ఆన‌వాయితీ. తాజాగా.. వైసీపీ నేత‌ల‌ను విమ‌ర్శించ‌డానికి మంత్రి నారా లోకేశ్‌ పవన్ కళ్యాణ్ హీరోగా న‌టించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని డైలాగులను వాడేసుకున్నారు. అదేనండీ.. బ్రహ్మనందం ‘భాస్కర అవార్డ్స్’ డైలాగులు.  వైసీపీ ఎంపీల రాజీనామాల అంశంపై ట్విట్టర్ వేదికపై ఆయ‌న సెటైర్లు వేశారు.  ఏమి నటన. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు భాస్కర అవార్డులకు అర్హులు.. అంటూ సెటైర్లు వేశారు. ఆస్కార్ తరహాలో తనకు తాను ఇఛ్చుకునేందుకు భాస్కర అవార్డ్స్ పెట్టుకుని ఇచ్చేసుకున్నారు బ్రహ్మనందం.

 

ఓవైపు చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు . ఉత్త‌రాంద్ర‌లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న టీడీపీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి లోకేశ్ ప‌వ‌న్ సినిమాలోని డైలాగ్స్‌ను వాడేసుకోవ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. రాజీనామాల‌ డ్రామాతో వైసీపీ ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేష్ ట్విట్టర్ లో ఆరోపించారు.  బీజేపీతో కుమ్మక్కు అయి రాజీనామాలపై కాలం వెల్ల‌బుచ్చార‌నీ.. ఉప‌ ఎన్నికలు ఎగ్గొట్టేందుకే ఈ ప్లాన్ వేశారని లోకేశ్‌ ఆరోపించారు. అంతేగాకుండా.. .వైసీపీ నేతలు తమ సొంత స్టోరీతో ఏ1, అరడజను దొంగలు పేరుతో ఓ టాలీవుడ్ సినిమా కూడా తీసుకోవచ్చని లోకేశ్‌  ఎద్దేవా చేశారు.

లోకేశ్‌కు సినిమా డైలాగులే దిక్కా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share