పాపం.. చిన్న రాజ‌ప్ప‌..!

March 13, 2019 at 4:46 pm

ఆయ‌న ఏపీ ఉప ముఖ్య‌మంత్రి చిన్న రాజ‌ప్ప‌.. టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మార్క్ రాజ‌కీయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టికెట్ కేటాయింపులో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆయ‌న‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క‌నేత‌లంద‌రూ వ‌రుస‌క‌ట్టి వైసీపీలోకి వెళ్తున్నారు. మ‌రికొంద‌రు అల‌క‌బూని అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. తాజాగా.. చిన్న‌రాజ‌ప్ప ప‌రిస్థితి కూడా ఆగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. చంద్ర‌బాబు ఇస్తున్న షాకుల‌తో అయోమ‌యం అవుతున్నారు. తీరా టికెట్ కేటాయింపు సంద‌ర్భంగా చంద్ర‌బాబు క‌దుపుతున్న‌పావులు మంత్రి చిన్న‌రాజ‌ప్పను ఆగ‌మాగం చేస్తున్నాయి.

మొత్తంగా మంత్రి చిన్న‌రాజ‌ప్ప సీటుకు చంద్ర‌బాబు ఎస‌రు పెడుతున్నార‌న్న విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీంతో అల‌క‌బూనిన మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఎవ‌రికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో లేర‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇలా అల‌క‌బూని అజ్ఞాతంలోకి వెళ్ల‌డం రెండోసారి కావ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా చిన్న రాజప్ప సీటు పార్టీవ‌ర్గాల్లో తీవ్ర‌ చర్చనీయాంశమైంది. ఈసారి పెద్దాపురం స్థానాన్ని బొడ్డు భాస్కర రామారావుకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. బొడ్డును భాస్కర్‌ను వెంటనే అమరావతి రావల్సిందిగా చంద్రబాబు పిల‌వ‌డం చిన్న‌రాజ‌ప్ప‌ను విస్మ‌యానికి గురిచేసిన‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు తీరుపై ఆయ‌న అనుచ‌రులు లోలోప‌ల మండిప‌డుతున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎంకే బాబు ఎస‌రుపెడుతున్నారంటూ పార్టీవ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ ప్ర‌చారం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి మ‌రి.

పాపం.. చిన్న రాజ‌ప్ప‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share