ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రివ్యూ…బాల‌య్య అద‌ర‌గొట్టాడు..

January 9, 2019 at 8:18 am

చిత్రం: ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు
విడుద‌ల‌: 09-01-2019
న‌టీన‌టులు: బాల‌క‌`ష్ణ‌, విద్యాబాల‌న్ త‌దిత‌రులు
సంగీతం: కీర‌వాణి
నిర్మాత‌లు: కొర్ర‌పాటి రంగ‌నాథ‌సాయి, బాల‌క‌`ష్ణ‌

నంద‌మూరి తార‌క‌రామారావు.. తెలుగుప్ర‌జ‌ల హ‌`ద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు.. రాజ‌కీయ దురంధ‌రుడు.. సాధార‌ణ వ్య‌క్తి నుంచి తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన ఎన్టీఆర్ జీవితాన్ని తెర‌పై ఆవిష్క‌రించ‌డమంటే మాట‌లు కాదు. ఆయ‌న జీవితంలోని ప్ర‌తీ కోణాన్ని ట‌చ్ చేయ‌డమంటే సాహ‌స‌మ‌నే చెప్పాలి. ద‌ర్శ‌కుడు క్రిష్‌, హీరో బాల‌క‌`ష్ణ అంత‌టి సాహ‌సానికి దిగి.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా పూర్తి చేశారు. తెలుగు ప్ర‌జ‌లు, రాజ‌కీయ‌వ‌ర్గాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మొద‌టి భాగం ఎన్టీఆర్‌- క‌థానాయ‌కుడు ఈరోజులు విడుద‌ల అయింది. మ‌రి ఈ బ‌యోపిక్ అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఉందా..? అన్న‌గారి జీవితాన్ని క్రిష్ సంపూర్ణంగా ఆవిష్క‌రించారా..? త‌ండ్రి ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య బాబు మెప్పించాడా లేదా అన్న‌ది రివ్యూ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..49696707_1846100578850871_7218825381501992960_n

క‌థేమిటంటే…

సాధార‌ణ ఉద్యోగి రిజిస్ట్రార్‌గా ప‌ని చేసే ఎన్టీఆర్ సినిమాల‌పై ఉన్న మ‌క్కువ‌తో మ‌ద్రాస్‌కు ప్ర‌య‌ణం అయిన‌ప్ప‌టి నుంచి మొద‌లై.. రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేసి, తెలుగు దేశం పార్టీ పేరును ప్ర‌క‌టించేదాకా ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమా ఉంది. అంటే.. సాధార‌ణ ఉద్యోగి నుంచి సినిమాల్లోకి వెళ్లి, అక్క‌డ ఎదుర్కొన్న ఇబ్బందులు, క్ర‌మంగా సినిమాల్లో రాణించిన తీరు, ఈ క్ర‌మంలోనే కుటుంబ ఇబ్బందులు.. ఇలా అనేక అంశాలు ఈ భాగంలో ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌కుడు చూపించాడు. ఎన్టీఆర్ స‌తీమ‌ణిగా న‌టించిన విద్యాబాల‌న్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఎన్టీఆర్ జీవితాన్ని కుమారుడు హ‌రిక‌`ష్ణ‌(క‌ల్యాణ్‌రామ్‌) చెబుతుండ‌గా సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక సాధార‌ణ ఉద్యోగిగా ఎన్టీఆర్‌(బాల‌క‌`ష్ణ‌) ఎంట్రీ ఇస్తాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి మ‌ద్రాస్‌కు బ‌య‌లుదేరుతాడు. ఇక ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి.49763012_1845803938880535_6619233846602760192_n

ఎవ‌రెలా చేశారంటే..

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమా మొత్తానికి బ‌లం ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించిన బాల‌య్య‌. ఆయ‌న క‌న‌బ‌ర్చిన న‌ట‌న అద్భుత‌మ‌నే చెప్పుకోవ‌చ్చు. అచ్చం ఎన్టీఆర్ లాగే హావ‌భావాలు ప‌లికించ‌డంతో థియేట‌ర్ల‌లో అభిమానులు ఈల‌ల‌తో గోల చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ 60ఏళ్ల వ‌య‌స్సులో బాల‌య్య‌బాబు ఒదిగిపోయారు. ఇక బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ ఒదిగిపోయారు. అంతేగాకుండా.. ఇందులో ఏఎన్నార్‌గా న‌టించిన సుమంత్ కూడా అచ్చం అక్కినేని నాగేశ్వ‌ర్‌రావును దించేశాడు. చంద్ర‌బాబు పాత్ర‌లో రానా, సావిత్రి పాత్ర‌లో నిత్య‌మీన‌న్‌, జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో హ‌న్సిక‌, రేలంగి పాత్ర‌లో బ్ర‌హ్మానందం, శ్రీ‌దేవి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్‌సింగ్ మెప్పించార‌నే చెప్పొచ్చు. మొత్తంగా ఇంత‌మంది ప్ర‌ముఖ న‌టుల‌ను ఆనాటి న‌టుల పాత్ర‌ల‌కు ఎంచుకుని క్రిష్ తీర్చిదిద్దిన తీరు అమోఘం.

ఎలా ఉందంటే..

ఎన్టీఆర్ సినీజీవితాన్ని సంపూర్ణంగా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో క్రిష్ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. నిజానికి.. అత్యంత క్లిష్ట స‌మ‌యంలో క్రిష్ ఈ ప్రాజెక్టును ఎంచుకున్నాడు. ఒక్క భాగం నుంచి సినిమా రెండు భాగాల‌కు వెళ్లింది. రెండింటినీ ఏక‌కాలంగా తెర‌పై ఆవిష్క‌రించ‌డం అంటే మాట‌లు కాదు మ‌రి. ఇక ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందించారు. ఇది కూడా సినిమాకు ప్ర‌ధాన బ‌లం. అద్భుత‌మైన పాట‌ల‌ను అందించాడు. అంతేగాకుండా సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూప‌ర్‌గా ఉంది. సాయిమాధ‌వ్ డైలాగులు కూడా బాగానే పేలాయి. అయితే.. సినిమాలో కొన్నికొన్ని అంశాలు సాగ‌దీత‌గా ఉండ‌డం కొంత నిరూత్సాహం క‌లుగుతుంది. మొత్తంగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను నంద‌మూరి అభిమానుల‌తోపాటు స‌గ‌టు ప్రేక్ష‌కులు కూడా ఎంజాయ్ చేస్తారు.

చివ‌రిగా.. బాల‌య్య అద‌ర‌గొట్టాడు..

రేటింగ్ :3.75/5

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రివ్యూ…బాల‌య్య అద‌ర‌గొట్టాడు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share