ఓరుగ‌ల్లులో పొత్తుకు చిల్లు…

November 20, 2018 at 4:26 pm

పొత్తు ధ‌ర్మం వీగిపోయింది. అన్ని రాజ‌కీయ పార్టీలు వ‌రంగ‌ల్ తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ ప్రాతినిధ్యం కొన‌సాగించాల‌ని బలంగా భావించాయి. అందుకు అనుగుణంగానే గెలుపు గుర్రాల‌ను ఎంపిక చేసుకున్నాయి. అయితే అస‌మ్మ‌తి సెగ‌లు ఎగిసిప‌డ‌టం…ముఖ్య‌నేత‌ల డిమాండ్ల నేప‌థ్యంలో పొత్తు రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌తి త‌ప్పింది. మ‌హాకూట‌మి నేత‌ల ఒప్పందాల‌కు బీట‌లు వారాయి. మొద‌ట్నుంచి తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుబ‌ట్టింది. త‌మ పార్టీ అభ్య‌ర్థికే అక్క‌డ టికెట్ కేటాయించాల‌ని స్వ‌యంగా కోదండ‌రాం ప‌లుమార్లు కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌కు విన్న‌వించారు. అందుకు అనుగుణంగానే మొద‌ట టీజేఎస్ సూచించిన గాదె ఇన్న‌య్య‌కు టికెట్ ఇచ్చారు. అయితే అనుహ్యంగా ఆదివారం అర్ధ‌రాత్రి గాయ‌త్రి గ్రానైట్ సంస్థ అధినేత వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌కు కాంగ్రెస్ బీఫాం అంద‌జేసింది. దీంతో ఇక్క‌డ మ‌హాకూట‌మి అభ్య‌ర్థి కాకుండా టీజేఎస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థులుగా వారు నామినేష‌న్ వేశారు. ర‌విచంద్ర‌కు టికెట్ ద‌క్క‌డంలో కొండా ముర‌ళి కీల‌క పాత్ర‌పోషించిన‌ట్లు స‌మాచారం.States-Oct1-5

ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ రాజ‌నాల శ్రీహ‌రి రెబ‌ల్ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. టీఆర్ ఎస్ నుంచి టికెట్ ద‌క్క‌ని ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు. వీరే కాక ఇత‌ర గుర్తింపు పొందిన పార్టీల నుంచి ప‌లువురు పోటీలో ఉన్నారు. మొత్తం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 37మంది నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇప్ప‌టికే ఎవ‌రికీ వారు ప్ర‌చారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి ర‌విచంద్ర‌..టీజేఎస్ నుంచి ఇన్న‌య్య మ‌హా కూట‌మి అభ్య‌ర్థిని తానేనంటూ చెప్పుకుంటున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ నాటికి నా అభ్య‌ర్థ‌త్వ‌మే ఫైన‌ల్ అవుతుంద‌ని ఎవ‌రికి వారు ప్ర‌చారం చేసుకుంటున్నారు. టీఆర్ ఎస్ నుంచి మేయ‌ర్ న‌న్న‌పునేని న‌రేంద‌ర్ బ‌రిలో ఉన్నారు.

ఇక ప‌శ్చిమ విష‌యానికి వ‌స్తే మ‌హాకూట‌మి అభ్య‌ర్థిగా రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి విన‌య్‌భాస్క‌ర్‌, కాంగ్రెస్ రెబ‌ల్ అభ్య‌ర్థిగా నాయిని రాజేంద‌ర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నాయినిని బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది. ఆయ‌న పోటీలో ఉంటే మ‌హాకూట‌మి ఓట్లు చీలి టీఆర్ ఎస్‌కు లాభిస్తుంద‌ని కూట‌మి నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే నాయిని మాత్రం బ‌రిలో ఉండి తీరుతాన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌చారం కూడా ఆరంభించారు. స్థానిక నియోజ‌క‌వ‌ర్గం పార్టీ నేత‌ల నుంచి కూడా ఆయ‌న‌కు సానుభూతి ల‌భిస్తోంది. టీఆర్ ఎస్‌ను ఎదుర్కొవాలంటే రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు చీల‌కుండా చూసుకోవాల‌ని, స్వ‌తంత్ర అభ్య‌ర్థుల చే నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకుని త‌మ‌కు మ‌ద్ద‌తు తెలిపేలా కూట‌మి నేత‌లు చ‌ర్య‌లు ఆరంభించిన‌ట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్‌లో మాత్రం త‌మ‌కు లాభిస్తుంద‌నే లాభిస్తుంద‌నే ధీమా వ్య‌క్తం మ‌వుతోంద‌ని స‌మాచారం.

ఓరుగ‌ల్లులో పొత్తుకు చిల్లు…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share