తమిళ సీఎంగా పళనిస్వామి…వణికిపోతోన్న కోలీవుడ్ స్టార్స్

February 17, 2017 at 9:40 am
100

త‌మిళ‌నాట శశికళ – పన్నీర్ సెల్వం మధ్య సీఎం కుర్చీ వార్ వ‌న్డే క్రికెట్ మ్యాచ్‌ను త‌ల‌పించింది. ఎట్ట‌కేల‌కు శ‌శిక‌ళ వ‌ర్గానికి చెందిన ప‌ళ‌నిస్వామి త‌మిళ‌నాడు 12వ సీఎంగా పీఠం అధిష్టించారు. అయితే ప‌న్నీర్ శ‌శిని టార్గెట్‌గా చేసుకుని గ‌ట్టిగానే విమ‌ర్శ‌లు సంధించారు. ఈ వార్‌లో కోలీవుడ్ మొత్తం ప‌న్నీర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది.

కోలీవుడ్ న‌టులు కమల్,గౌతమి,ఆర్య మొదలుకొని ఎంతో మంది పన్నీర్ కి అండగా శశికి వ్యతిరేకంగా గొంతు చించుకున్నారు. సోష‌ల్ మీడియా సాక్షిగా ప‌న్నీర్‌కు త‌మ మ‌ద్ద‌తు ఇచ్చారు. ముందుగా క‌మ‌ల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్‌తో శ‌శిమీద విరుచుకుప‌డ్డాడు. ఆ త‌ర్వాత క‌మ‌ల్‌తో చాలా ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేసిన గౌత‌మీ అయితే శ‌శిక‌ళ‌కు యాంటీ ప్ర‌చార‌క‌ర్త రోల్‌లో పోషించినంత ప‌నిచేశారు.

ఆర్య‌తో పాటు చాలా మంది న‌టీన‌టులు ట్వీట్‌ల‌తో ప‌న్నీర్ త‌మిళ సీఎం అయితే బాగుంటుంద‌ని పోస్టులు పెట్టారు. ఇప్పుడు శ‌శి వ‌ర్గానికే చెందిన ప‌ళ‌నిస్వామి సీఎం అవ్వ‌డంతో కోలీవుడ్‌లో శ‌శికి యాంటీగా ట్వీట్ లు వేసినవాళ్లంతా ఇప్పుడు వణికిపోతున్నారు.

కోలీవుడ్ ప్రముఖులు అలా వణికిపోడానికి కారణం లేకపోలేదు.ఒకప్పుడు జయకి వ్యతిరేకంగా ఇలాగే మాట్లాడి కమల్,విజయ్ లాంటి అగ్రశ్రేణి హీరోలే తమ సినిమా విడుదల చేసుకోడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చూశాం. క‌మ‌ల్ విశ్వ‌రూపం త‌మిళ్ కంటే తెలుగులో ముందు రిలీజ్ అయ్యింది. విజ‌య్ అయితే త‌లైవా (అన్నా) పులి, తుఫాకీ సినిమాల టైంలో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాడు.

ఇక శ‌శిక‌ళ జ‌య స‌మాధి మీద త‌న వ్య‌తిరేకులంద‌రికి చుక్క‌లు చూపిస్తాన‌ని శ‌ప‌థం చేసిన‌ట్టు మ‌రో రూమ‌ర్ రావ‌డంతో కోలీవుడ్ వాళ్ల‌తో పాటు శ‌శికి యాంటీగా ప‌ని చేసిన అన్నాడీఎంకే నాయ‌కులు కూడా వ‌ణికిపోతున్నారు.

తమిళ సీఎంగా పళనిస్వామి…వణికిపోతోన్న కోలీవుడ్ స్టార్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share