ఊహించని ట్విస్ట్ …పోటీ నుండి తప్పుకున్న పరిటాల సునీత !

March 13, 2019 at 3:58 pm

టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం.. ప‌రిటాల కుటుంబంలో చిచ్చురేపుతుందా..? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలో టీడీపీకీ ఊహించ‌ని ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. చంద్ర‌బాబు టికెట్ల కేటాయింపు పార్టీవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఒక‌రికి టికెట్ ఇస్తే.. మ‌రొక‌రు పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు..! జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి పరిటాల సునీత పేరును అధిష్టానం ఖరారు చేసింది.

అయితే.. ఆమె మాత్రం అభిమానుల కోరిక మేరకు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని ప్రకటించారు. నిజానికి.. రాప్తాడుతోపాటు క‌ల్యాణ‌దుర్గం టికెట్ల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని ప‌రిటాల సునీత కోరారు. కానీ.. చంద్ర‌బాబు కేవ‌లం సునీత‌కు మాత్ర‌మ టికెట్ కేటాయించి.. ప‌రిటాల ఫ్యామిలీకి ట్విస్ట్ ఇచ్చారు. అయితే.. త‌న‌కు టికెట్ కేటాయించినా.. తనకు బదులుగా రాప్తాడు నుంచి శ్రీ‌రామ్‌ పోటీ చేస్తారని సునీత‌ స్పష్టం చేశారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్తాన‌ని ఆమె అంటున్నారు. ఇదిలా ఉండ‌గానే.. శ్రీరామ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ముత్తవ్వకుంట్ల ఎన్నికల ప్రచారంలో సునీత పిలుపునిచ్చారు.

ప‌రిటాల సునీత నిర్ణ‌యంతో పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారుతోంది. ఇందులో ఓ వ‌ర్గం ప‌రిటాల శ్రీ‌రామ్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. శ్రీ‌రామ్ పోటీ చేస్తాడ‌ని సునీత ప్ర‌క‌టించ‌డంపై కూడా కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ముందుముందు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయోన‌ని పార్టీ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి ప్ర‌తికూల ఫ‌లితం త‌ప్ప‌ద‌ని.. ఇదంతా కూడా ప‌రిటాల కుటుంబానికి చెక్‌పెట్టేందుకే చంద్ర‌బాబు ఇలా ట్విస్ట్ ఇచ్చార‌నే టాక్ వినిపిస్తోంది.

ఊహించని ట్విస్ట్ …పోటీ నుండి తప్పుకున్న పరిటాల సునీత !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share