తెరవెనుక మెగా బ్రదర్స్ రాజకీయ తతంగం!

November 6, 2018 at 11:30 am

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌జాల‌రు. ముఖ్యంగా ప్ర‌జ‌ల నాడి ఎలా అయితే, ప‌ట్ట‌లేమో.. రాజకీ యాల్లో నాయ‌కుల నాడిని కూడా ప‌ట్టుకోవ‌డం అంతే క‌ష్టం. రాష్ట్రంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు.. వేగంగా మారిపోతు న్నాయి. ప్ర‌ధాన పార్టీలు టీడీపీ వైసీపీలు పోటీ ప‌డే అవ‌కాశం ఉంద‌ని మొద‌ట్లో అనుకున్నా.. ఇప్పుడు ఈ రెండు పార్టీల మ‌ధ్య‌కు దూసుకు వ‌చ్చిన జ‌న‌సేన పార్టీ ఇప్పుడు ఉధృతంగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌రకు త‌న ప‌ద‌వుల‌పై అభిమానం లేద‌ని, ప్ర‌శ్నించ‌డానికి మాత్ర‌మే పార్టీ పెట్టాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఇప్పుడు మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న చెప్ప‌డం చాలా చిత్రంగా అనిపిస్తోంది.45467531_710028602729751_9157657323534024704_n

త‌న‌కు అనుభ‌వం లేద‌ని, త‌న‌ను తాను సీఎంగా చూసేందుకు సైతం మ‌నసు అంగీక‌రించ‌ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న గ‌ళం గ‌డిచిన రెండు మాసాలుగా మారుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంటే.. తానే బ‌రిలోకి దిగుతాన‌ని సీఎం అవుతాన‌ని చెబుతున్నారు. అయితే, అంత‌లోనే ఇంత మార్పున‌కు కార‌ణం ఏంట‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే, ఇంత మార్పున‌కు ప‌వ‌న్ వెనుక అదృశ్య శ‌క్తి ఒక‌టి ఉంద‌ని, అదే ఆయ‌న‌ను న‌డిపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి.. 18 స్థానాలు ద‌క్కించుకుని కూడా పార్టీని నిల‌బెట్టుకోలేక పోయిన చిరంజీవి తర్వాత పార్టీని ఏకంగా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇక‌, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆయ‌న కొన‌సాగుతున్నారు.P34N41C

తాజాగా ఆయ‌న కాంగ్రెస్ స‌భ్య‌త్వం.. ముగిసిపోయినా.. రెన్యువ‌ల్ చేయించుకోలేదు. దీంతో చిరు ఇక కాంగ్రెస్‌లో కొన‌సాగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన లోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది ఇదిలావుంటే, తె ర మ‌రుగున ఉంటూనే త‌న త‌మ్ముడి పార్టీకి చిరంజీవి సాయం చేస్తున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో మారిన రాజ కీయ ముఖ చిత్రం నేప‌థ్యంలో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తును వ్య‌తిరేకిస్తూ.. అనేక మంది నాయ‌కులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా బ య‌ట‌కు వ‌స్తున్నారు. సీ రామ‌చంద్ర‌య్య‌, వట్టి వ‌సంత కుమార్‌.. వంటి కీల‌క నాయ‌కులు కూడా ఇప్ప‌టికే రాజీనామా చేశారు. మ‌రి ఎన్నిక‌ల ముంగిట వీరు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? ఏ పార్టీలో చేర‌తారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. వీరి ఆలోచ‌న‌ల‌ను బ్రేక్ చేస్తూ.. చిరు ఇచ్చిన స‌ల‌హా మేరకు త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీలో చేర‌తార‌ని అంటున్నారు. వాస్త‌వానికి సీనియ‌ర్లు, సూచ‌న‌లు చేసేవారు లేకుండా పోయిన జ‌న‌సేనకు ఇప్పుడు ఇలాంటి వారు తురుపు ముక్క‌లు కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

తెరవెనుక మెగా బ్రదర్స్ రాజకీయ తతంగం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share