పవన్ కళ్యాన్ కి కోర్టు సమన్లు..కోర్టు మెట్టు ఎక్కాల్సిందేనా!

July 4, 2018 at 8:07 pm
pawan-court notice

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధవారం (జులై 4) సమన్లు జారీచేసింది. ఓ మీడియా సంస్థ యజమాని దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జులై 24న స్వయంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ కోర్టుకు హాజరుకావాలని తెలిపింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. 

 

వ్యక్తిగతంగా లేదా.. న్యాయవాది ద్వారా హాజరు కావాలని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి ఆదేశించింది. కొద్ది రోజుల కిందట టాలీవుడ్‌లో శ్రీరెడ్డి అనే నటీమణి లేవనెత్తిన వివాదం అటూ.. ఇటూ తిరిగి పవన్ కల్యాణ్ వద్దకు చేరింది.  నటి శ్రీ రెడ్డి తన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ పవన్.. ఆమె వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన చానెళ్లపై విమర్శలు చేశారు.  

 

 ఆ వ్యాఖ్యలను ఓ చానెల్ మరీ ఎక్కువగా ప్రసారం చేసిందని ఆగ్రహించిన పవన్ దాని యజమానిని ఉద్దేశిస్తూ అనుచిత ట్వీట్లు చేశారు. దీంతో ఆ మీడియా సంస్థ యజమాని పవన్‌కు.. తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తనకు క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

 

అయితే ఈ నోటీసులకు పవన్ స్పందించకపోవడంతో ఆయనపై పరువు నష్టం దావా వేశారు.  దీంతో టీవీ నైన్ యజమాని శ్రీనిరాజు, ఏబీఎన్ ఏండీ రాధాకృష్ణ విడివిడిగా పరువు నష్టం నోటీసులు పంపారు.  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి పవన్ సమాధానం ఇవ్వకపోవడంతో రూ. 10 కోట్ల పరువు నష్టం దావాతో ఏబీఎన్ ఎండీ కోర్టును ఆశ్రయించారు. 

 

 అయితే పరువు నష్టం కేసుల విషయంలో పవన్ కల్యాణ్ నేరుగా కోర్టుకు హాజరవకుండా మినహాయింపు పొందే అవకాశం ఉంది. లాయర్ల ద్వారా ఈ ప్రయత్నాలు చేయవచ్చు. లేదా మీడియా సంస్థలతో రాజీ చేసుకోవచ్చు. కానీ మొండిగా ముందుకు వెళ్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెబుతున్నారు.  దీనిపై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. 

పవన్ కళ్యాన్ కి కోర్టు సమన్లు..కోర్టు మెట్టు ఎక్కాల్సిందేనా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share