గురివింద రాజ‌కీయాల్లో ప‌వ‌న్ బిజీనా ..?

November 3, 2018 at 11:28 am

అవును! రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు త‌మ త‌ప్పులు తాము తెలుసుకోవ‌డంలో చాలా వెనుక‌బ‌డే ఉంటున్నారు. ఎదు టివారు చేసిన త‌ప్పుల‌నే వారు పైకి చెబుతున్నారు. ముఖ్యంగా ప్ర‌శ్నిస్తానంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి పార్టీ పెట్టిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు .. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో కేంద్రంలో ని కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్ట‌డాన్ని ఆయ‌న తీవ్రంగా భావిస్తున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బాబును తానే నిల‌బెట్టాన‌ని, త‌ను త‌ప్పి తే.. ఆయ‌న అధికారంలోకి కూడా వ‌చ్చేవారు కాద‌ని ప‌వ‌న్ అభిప్రాయం. అంటే.. రాష్ట్రంలో రాజ‌కీయాలు ఎలా ఉన్నా కూ డా ప్ర‌జ‌లు ఏమై పోయినా కూడా త‌న హ‌వానే సాగాల‌నే కుంచిత అభిప్రాయాన్నే ప‌వ‌న్ వెల్ల‌డిస్తున్నారు.45263871_708242366241708_8398979847803633664_n

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న అవ‌స‌రం చంద్ర‌బాబుకు ఉండాల‌ని, వ‌చ్చి తీరాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఎలాగూ బీజేపీతో చె డిపోయింది కాబ‌ట్టి.. టీడీపీ.. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. కాంగ్రెస్‌తో చేతులు క‌లిపే ప్ర‌స‌క్తి లేద‌ని ప‌వ‌న్ భావించారు. ఇక‌, చివ‌ర కు మిగిలింది.. త‌న చెంత‌కు చేర‌డ‌మే! అయితే, ఈ విష‌యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌డ‌తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు ఈ అక్క‌సే ప‌వ‌న్‌లో స్ఫ‌ష్టంగా క‌నిపించింది. కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టిన చంద్ర‌బాబును సిగ్గుందా? అని ప్ర‌శ్నించేలా చేయ‌గ‌లిగింది. నిజానికి ఇది దుర‌హంకారం. రాజకీయాల్లోకి వ‌చ్చాక‌.. అనేక మార్పులు స‌హ‌జం. ఇంత‌క‌న్నా ఎక్కువ‌గానే పెత్త‌నం చెలాయించాల‌ని చూసిన ఎన్టీఆర్ సైతం కొన్ని సంద‌ర్భాల్లో త‌గ్గి వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయి.45249911_708218929577385_1673977062827753472_n

వ్యూహాత్మ‌కంగా చంద్ర‌బాబు వేసిన అడుగులు.. ఇప్ప‌టికిప్పుడు వెగ‌టు పుట్టించ‌డంలో త‌ప్పులేదు. కానీ, దీర్ఘ దృష్టితో చూసుకున్న‌ప్పుడు ఏపీకి మేలు చేయ‌గ‌లిగే పార్టీకి మ‌ద్ద‌తివ్వ‌డం త‌ప్పుకాద‌నే అభిప్రాయం త‌ప్ప‌కుండా వినిపిస్తుంది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కానీ, ప్ర‌త్యేక హోదా విష‌యంలో కానీ, ప్యాకేజీ స‌మ‌యంలో కానీ కేంద్రంపై పోరు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిసి కూడా షూటింగుల‌కు ప‌రిమిత‌మైన జ‌నసేనాని ఇప్పుడు చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ‌డం అంత స‌మంజ‌సంగా లేద‌నేది విజ్ఞుల వ్యాఖ్య‌లు కూడా! ఎవ‌రి పార్టీ వారి ఇష్టం. ఇప్పుడు మీకు అధికారం అక్క‌ర్లేదు. చేతిలో బోలెడు సినిమాలు కోరుకుంటే వాల‌నున్నాయి. కాబ‌ట్టి.. మీకు పొత్తుల విలువ తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ, వ్యూహాత్మ‌కంగా వేసే ప్ర‌తి అడుగు ఏపీకి మేలు చేస్తుంద‌ని భావిస్తే.. ఏపీ ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా హ‌ర్షించ‌క మాన‌రు. ఈ విష‌యాన్ని జ‌న‌సేనాని గుర్తిస్తే.. మంచిది!!

గురివింద రాజ‌కీయాల్లో ప‌వ‌న్ బిజీనా ..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share