ప‌వ‌న్‌ను వ‌ర్మ‌.. మ‌ళ్లీ కెలికేశాడుగా!

May 8, 2018 at 2:58 pm
pawan-varma

ఎదుటి వాళ్ల‌ను కెలిక‌డంలో ముందుండే సంచ‌ల‌న వివాదాస్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌.. తాజాగా మ‌రోసారి ప‌వ‌న్‌ను కెలికాడు. ఇటీవ‌లే న‌టి శ్రీరెడ్డి విష‌యంలో ఎడా పెడా చెంప దెబ్బ‌లు తిన్నా.. వ‌ర్మ టంగ్ టైట్ కాలేదు. తాజాగా మ‌రోసారి ప‌వ‌న్‌నే కాకుండా ఆయ‌న ఫ్యాన్స్‌ను కూడా విమ‌ర్శించాడు. అది కూడా త‌న మూవీ ఆఫీస‌ర్ ను అడ్డు పెట్టుకుని వ‌ర్మ రెచ్చిపోయాడు. ట్వీట్ల మీద ట్వీట్లు కురిపించాడు. ప‌వ‌న్ ప‌రువు పోతోందిగా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తాజాగా వ‌ర్మ‌, నాగ్ కాంబినేష‌న్‌లో ఆఫీస‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీ టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. అయితే, దీనిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌మ అభిప్రాయం వెల్ల‌డించారు. ఎంత‌మంది లైక్ కొట్టారో.. అంతే సంఖ్య‌లో డిస్‌లైక్ కొట్టారు. 

 

ఈ ప‌రిణామంతో వ‌ర్మ రెచ్చిపోయాడు. ‘ఆఫీసర్‌’ సినిమా టీజర్‌కు 11 వేల మంది డిస్‌లైక్స్ కొట్ట‌డంతో ఈ ప‌రిణామాన్ని ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు ముడిపెడుతూ..  వ‌ర్మ‌ వరుస ట్వీట్ల‌తో హోరెత్తించాడు.  ఇంకా ఇంకా డిస్‌లైక్స్‌ కొట్టి పవన్‌ ఫ్యాన్స్‌ తమ సత్తా చూపించాలని, ఓ అభిమానిగా.. నాగార్జున, ఆఫీస‌ర్ డైరెక్ట‌ర్‌గా  ఈ మేరకు పవన్‌ ఫ్యాన్స్‌కు, జనసేనకు వార్నింగ్‌ ఇస్తున్నాన‌ని వర్మ రాసుకొచ్చాడు. ‘‘11 కోట్ల మంది తెలుగు ప్రజల్లో పవన్‌ అభిమానుల సంఖ్య 11 వేలేనా? ఓ అభిమానిగా నేనే షాకవుతున్నా. మా సినిమా టీజర్‌ను ఇంకా వేలమంది డిస్‌లైక్‌ చేసి.. అభిమానుల సంఖ్య ఇంత తక్కువ కాదని నిరూపించాలి. ఇది.. నాగార్జున-ఆఫీసర్‌ తరఫున పీకే ఫ్యాన్స్‌కు నా వార్నింగ్‌. జనసేన పార్టీ కూడా ఈ (11 వేల మందే అన్న) విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేకుంటే ఇదీ ప్రజారాజ్యం పార్టీలా డిజాస్టర్‌ అవుతుంది’’ అని వర్మ పేర్కొన్నాడు.

 

నాగార్జున-వర్మ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆఫీసర్‌’ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుద లైన రెండో టీజర్‌కు లైక్స్‌తో సమానంగా డిస్‌లైక్స్ ప‌డ్డాయి. కూడబలుక్కొని మరీ పవన్‌ ఫ్యాన్స్‌ డిస్‌లైక్స్‌ కొడుతున్నార న్న వర్మ.. ఆ మేరకు కొందరి పోస్టులను ఉటంకించాడు. అయితే, ఇంత‌లా ఓ సినిమా డిస్‌లైక్స్‌ను ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు ముడిపెట్ట‌డం ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికే శ్రీరెడ్డి ఉదంతంలో తీవ్ర దుమారం రేపి చివ‌రికి.. సారి చెప్పేసిన వ‌ర్మ‌.. ఇప్పుడు సృష్టించిన ఈ డిస్‌లైక్ తుఫాను ఎటు దారి తీస్తుందో.. ఎటు వెళ్లిఆయ‌న‌ను చుట్టుముడుతుందో చూడాలి. మొత్తంగా కెల‌క‌డం, కెలికించుకోవ‌డంలో వ‌ర్మ‌ను మించిన డైరెక్ట‌ర్ లేడ‌ని మ‌రోసారి రుజువ‌వుతోంది. 

ప‌వ‌న్‌ను వ‌ర్మ‌.. మ‌ళ్లీ కెలికేశాడుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share