పవన్ శాపం.. రాష్ట్రం నాలుగు ముక్కలు కావలి

November 5, 2018 at 12:59 pm
45467582_709649516100993_8725885566937202688_o copy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోపంతో రగిలి పోతున్నాడు పవన్ కోపం బాగా నషాలానికి ఎక్కేసింది చివరకు పవన్ శాపనార్థాలు పెట్టేస్తున్నాడు. పవన్ కోపం ఎవరి మీద పవన్ శాపనార్ధాలు ఎందుకు పెడుతున్నాడు అంటే మన రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్ళ పై పవన్ కు తట్టుకోలేనంత కోపం ఉందట. వాళ్ళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా నాలుగు ముక్కలు కావాలి అంత పెద్ద రాష్ట్రాన్ని చూసుకుని వాళ్లు విర్రవీగుతున్నారు అని పవన్ తాజాగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో దుమ్మెత్తిపోశారు.45539919_709612609438017_3403133370098515968_n

జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో మాట్లాడుతూ టీడీపీపై ధ్వజమెత్తారు. బిజెపి 1997 లోనే కాకినాడ లో జరిగిన సమావేశంలో ఒక ఓటు-రెండు రాష్ట్రాలు అన్న తీర్మానం చేసిందని అప్పుడే టిడిపి బిజెపి ని నిలదీయాలి ఉందని పవన్ ఫైర్ అయ్యాడు. ఏదేమైనా పవన్ 1997 నాటి తీర్మానాలు సైతం బయటకు తీస్తున్నాడు అంటే ఆయనకు రాష్ట్ర రాజకీయాలు బాగానే వంట పట్టాయని అనుకోవాల్సిందే. పవన్ టీడీపీపై ధ్వజమెత్తిన వరకు బాగానే ఉంది.45342259_709646586101286_6205429252465098752_n

అయితే గత ఎన్నికల్లో అదే బిజెపి తో కామ ఇప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీతో కలిసి ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. బిజెపికి టిడిపికి ఓట్లు వేసి ఆ కొట్టమని గెలిపించాలని ప్రచారం చేశాడు మరి ఈ లెక్కన ఏపీకి తీవ్రమైన అన్యాయం చేసిన బిజెపి తో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంశాలపై మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదు అన్న దానికి కూడా పవన్ ఆన్సర్ ఇస్తే బాగుంటుందేమో. ఏపీ బీజేపీ నాయ‌కుల‌తో పాటు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వాన్ని, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని సైతం ప్ర‌శ్నించ‌క‌పోతుండ‌డంతో కూడా ప‌లు సందేహాల‌కు తావిస్తోంది.

పవన్ శాపం.. రాష్ట్రం నాలుగు ముక్కలు కావలి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share