ఖాతా ఓపెన్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

October 4, 2018 at 10:42 am

రాజ‌కీయాలంటే ఇదేమ‌రి.. ఒక్క‌సారి అడుగుపెడితే చాలు అవే అన్నీ నేర్పిస్తాయి. నీతులు చెప్పుకుంటూ.. సూక్తులు వ‌ల్లించుకుంటూ పోతే గోతి పెద్ద‌ద‌వుతుందే త‌ప్ప పైసాలేనిది ఏ ప‌నీ కాద‌నే విష‌యం మ‌న జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు బాగా అర్థ‌మైన‌ట్టుంది. త‌నూ ఖాతా తెరిచేశారు. ఖ‌ర్చు త‌డిసిమోప‌డు అవుతుంటే త‌ట్టుకోలేక విరాళాల సేక‌ర‌ణ‌కు గేట్లు బార్లా తీశారు. ఆర్థికంగా అండ‌గా ఉండాల‌ని కోరుతున్నారు. ఇన్నాళ్లూ చెప్పిన ముచ్చ‌ట‌ను ప‌క్క‌న ప‌డేసి.. చేతిలో త‌డిలేనిదే ఏదీ కాద‌ని గుర్తించి, మంది ముందు చేయిచాచుతున్నారు. నిన్నమొన్నటి వరకూ విరాళాలు అడగడానికి, తీసుకోడానికి ఇబ్బంది ప‌డిన ప‌వ‌న్ ఇప్పుడు సిగ్గు, మొహమాటాన్ని వ‌దిలేశారు.43070583_690759617989983_5714911684812865536_n

ఓవైపు స‌భ‌లు, స‌మావేశాల‌తో జ‌నంలోకి వెళ్తూనే.. మ‌రోవైపు విరాళాల సేక‌ర‌ణ‌లో జోరు పెంచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జనసేనకు విరాళాలివ్వండి అనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఈ బాధ్య‌త‌ను సోషల్ మీడియా వింగ్ కి అప్ప‌గించారు. ఇక బాస్ నుంచే గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో.. సోష‌ల్ మీడియా వింగ్ త‌న ప‌నికి ప‌దును పెడుతోంది. స‌భ‌లు, స‌మావేశాల్లో పవన్ చెప్పిన‌ పంచ్ డైలాగులతో ప్రోమోలు రెడీ చేసి, చివర్లో అందరి అభివృద్ధి కోసం పోరాడే జనసేనకు విరాళాలివ్వండి అంటూ లింక్ పోస్ట్ చేస్తోంది. దీంతోనే అర్థ‌మ‌వుతోంది ప‌వ‌న్ మ‌న‌సులోని మాట ఏమిటో. ఇక పార్టీ త‌రుపున పోటీ చేయాల‌నుకుంటున్న ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు.

నిజానికి జ‌న‌సేన పార్టీని స్థాపించిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరాళాలు సేక‌రించిన దాఖ‌లాలు లేవు. ఇక 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ పొత్తుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న ఖ‌ర్చంతా ఆ కూట‌మే చూసుకుంది. దీంతో ఆయ‌న సొంతంగా ఖ‌ర్చు చేయాల్సిన అవస‌రం రాలేదు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన సొంతంగా రంగంలోకి దిగుతోంది. ఇప్ప‌టికే ఏపీలో ప‌వ‌న్ నిరంత‌రం ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టిదాకా త‌న సొంత ఖ‌ర్చుల‌తో పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆర్థిక ఇబ్బందులు మొద‌లయ్యాయి. కానీ.. ఇలా ఎన్నిరోజులు చేయ‌గ‌లుగుతామ‌నే అంచానాకు ఆయ‌న వ‌చ్చారు. అందుకేనేమో.. విరాళాల విష‌యంలో మొహ‌మాటాన్ని వ‌దిలేశారు.

ఖాతా ఓపెన్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share