మెగా ప్రొడ్యూసర్ కనుసన్నల్లో పవన్ కవాతు !

October 15, 2018 at 4:49 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పొలిటికల్ ముచ్చట్లే..వినిపిస్తున్నాయి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ తాము చేసిన అభివృద్దిని చూసి ప్రజలకు తమకు ఓట్లు వేస్తారని అంటున్నారు. మరోవైపు వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’తో అధికార పార్టీ ప్రజలను మోసం చేసిందని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ కూడా మొదటి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జనసేన పార్టీ తరుపున భారీ ఎత్తున కవాతు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరి వంతెనపై ఈస్ట్-వెస్ట్ అనుసంధానం మాదిరిగా జనాలను భారీగా మోహరించి, అటు కార్లు, ఇటు పడవలతో జనాలను నింపేసి, జనసేన సత్తాచాటే ప్రయత్నం ఇది. ఆ మద్య జగన్ చేసిన ప్రచారంలో.. గోదావరి వంతెన మీద జనసందోహం భయంకరంగా కనిపించింది. అయితే జనసేన కవాతు అంతకు మించి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ బాధ్యతలు ఓ బడా నిర్మాత తీసుకున్నట్లు టాక్. ఇటు అరవింద్ కు అటు బన్నీకి అత్యంత సన్నిహితుడు అయిన బన్నీ వాస్ దాదాపు వారం రోజులుగా రాజమండ్రిలో ఉంటూ కవాతు కార్యక్రమానికి అన్ని రకాలుగా తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు సమాచారం. ఆయనే దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బన్ని వాసు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న విషయం బహుషా అరవింద్, అల్లు అర్జున్ కి తెలిసే ఉంటేంది..ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా వుంటే ఈ కవాతు కార్యక్రమం కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు జనసేన పార్టీ రోజు రోజుకీ పుంజుకుంటున్న నేపథ్యంలో ఈస్ట్, వెస్ట్ ల్లో టికెట్ లు ఆశిస్తున్నవారు, పార్టీ సానుభూతి పరులు, పార్టీకి ఆర్థికంగా దన్నుగా నిల్చున్నవారు, భారీగా ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మెగా ప్రొడ్యూసర్ కనుసన్నల్లో పవన్ కవాతు !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share