పవన్ జోరు … జనసేన ఖాతాలో మరో ఛానల్

October 8, 2018 at 11:20 am

లేటుగా వ‌చ్చినా లేటెస్ట్ రాజ‌కీయాల‌తో దూసుకు పోతున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన‌కి మ‌రో మీడియా ఛానెల్ యాడ్ కానుంది. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఏం చేశామ‌నే దానిక‌న్నా.. మ‌న‌కు ఎంత ప్ర‌చారం జ‌రిగింద‌నేదే అత్యంత కీలకం. నాయ‌కుల గురించి పాజిటివ్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌డం, ప్ర‌సారం చేయ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకునే మీడియా ఉంటే చాలు.. `ఆ కిక్కే వేర‌ప్పా`- అనేలా రాజ‌కీయాలు ఉండ‌డం గ‌మ‌నా ర్హం. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అధికార టీడీపీకి అన‌ధికారికంగా రెండు మెగా మీడియా సంస్థ‌లు ద‌న్నుగా నిలిచాయి. ఆయ‌న గురించి ఎంత పాజిటివ్‌గా ప్ర‌చారం చేయాలో.. అంతా చేస్తున్నాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న‌కు సంబంధించి నెగిటివ్ వార్త‌ల‌ను ఎంత ఎలిమినేట్ చేయాలో అంతా చేస్తున్నా యి. ఫ‌లితంగా అధికార పార్టీ హ‌వా జోరుగా సాగుతోంది. ఇక‌, ప్ర‌ధాన విప‌క్షం వైసీపీకి కూడా సొంతగా మీడియా సంస్థ ఉండ‌డం గ‌మ‌నార్హం.43372261_693636924368919_2933119980612354048_n

జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుకుని, ఆయ‌న‌కు సంబంధించి పాజిటివ్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌డంలో ఈ మీడియా కృషిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేం. 2014లోనూ ఇదే జ‌రిగింది. మీడియా ద‌న్నుతోనే చంద్ర‌బాబు అదికారంలోకి వ‌చ్చార‌నేది వాస్త‌వం. ఇప్పుడు కూడా ఆయ‌న పాల‌న‌లో ఎన్నో లోపా లు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న కేబినెట్‌లో ఎన్ని లోపాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఈ మీడియా అండ‌తో చంద్ర‌బాబు పాల‌న సాగిస్తున్నార‌నేది ఎలాంటి అనుమానానికి తావివ్వ‌ని అంశం. ఇక‌, త‌న ఫేస్ వాల్యూ ఎంత ఉన్న‌ప్ప‌టికీ.. త‌న‌కు అభిమానులు కోకొల్ల‌లుగా ఎంత‌మంది ఉన్నా కూడా .. ప‌వ‌న్ కూడా ఇప్పుడు మీడియా జ‌ప‌మే చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. చంద్ర‌బాబుతో ఆయ‌న రాజ‌కీయాలు చేసినంత కాలం.. ప‌వ‌న్‌కు అనుకూలంగా బాబు అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ఆయ‌న ఏం మాట్లాడినా హైలెట్ చేసింది.43511007_693637087702236_8260332801635647488_n

అయితే, ఎప్పుడైతే.. చంద్ర‌బాబు లోపాల‌ను వెతికి ప‌ట్టుకున్నారో అప్ప‌టి నుంచి మీడియా ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసింది. అంతేకాదు, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు, వ్యాఖ్య‌ల‌ను ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించింది. అంతేకాదు, ఆయ‌న శ్రీకాకుళం త‌దితర ప్రాంతాల్లో నిర్వ‌హించిన పోరాట యాత్ర‌కు క‌వ‌రేజ్ కూడా లేకుండా పోయింది. దీనిని గ‌మ‌నించిన ప‌వ‌న్‌.. త‌న‌కు కూడా అండ‌గా మీడియా ఉండాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే త‌న‌తో క‌లిసిన క‌మ్యూనిస్టులు సీపీఐ నేత‌ల‌కు ఉన్న మీడియా ఛానెల్ 99%ను కొనుగోలు చేయించారు. . సీపీఐ నేతల చేతుల్లో ఉన్న 99 టీవీ ఛానల్ ను పవన్ పార్టీకి మాజీ ఐఏఎస్ – జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆయనకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. అలా జనసేనకు పరోక్షంగా ఓ మీడియా చానల్ వచ్చింది.00000000

ఆ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌భ అధినేత‌, మాజీ మంత్రి ముత్తాగోపాలకృష్ణ జనసేన గూటికి చేరారు. దీంతో ఆ ప‌త్రిక కూడా జ‌న‌సేన‌కు అనుకూలంగా మారింది. తాజాగా ఓ ఎన్నారై పవన్ కోసం టీవీ ఛానల్ పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టెక్నికల్ సెటప్ అంతా రెడీ అయిందని కొన్ని అంశాలు సెట్ అయితే వచ్చే దసరాకే టెస్ట్ సిగ్నల్ అని తెలుస్తోంది. ఈ ఛానల్ కు సైతం సెంటిమెంట్ ను ఫాలో అవుతూ…9 అనే అంకె వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా ఓకే అయితే.. జ‌న‌సేన‌కు ద‌న్నుగా మ‌రో చానెల్ తోడుకానుంద‌ని అంటున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల స‌మ‌యానికి జ‌న‌సేన‌కు మ‌రింత ద‌న్ను చేకూర‌నుంద‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ కు మీడియా ఎంత మేర‌కు తోడ్పాటు అందిస్తుందో చూడాలి.

పవన్ జోరు … జనసేన ఖాతాలో మరో ఛానల్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share