పవన్ తో టీ తాగాలంటే పదిలక్షలా?

September 11, 2018 at 3:28 pm

పవన్ కల్యాణ్ కు సంబంధించి ‘టీకప్పులో తుపాను’ వంటి ఒక దుమారం రేగి అంతలోనే చల్లారిపోయింది. జనసన అధినేత పవన్ కల్యాణ్.. గత ఆదివారం నాడు హైదరాబాదులోని ఒక అయిదు నక్షత్రాల హోటల్లో కాపు కులానికి చెందిన చాలా మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ తో కలిసి సమావేశం నిర్వహించారు. దీనికి మీడియా కూడా హాజరైంది.

అయితే ఒక టీవీ న్యూస్ ఛానెల్.. ఈ సమావేశం గురించి వివాదాస్పద కథనాన్ని ప్రసారం చేసింది. పవన్ రహస్య సమావేశం నిర్వహించారని, కేవలం చందాలు పోగేయడానికే ఈ సమావేశం నిర్వహించారని.. వచ్చిన వాళ్లంతా అక్కడికక్కడే భారీ విరాళాలు ప్రకటించారని అందులో చెప్పారు. ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ ఇలా కాపు కుల పెద్దలనుంచి భారీ విరాళాలు పోగేస్తున్నాడంటూ, అందుకోసం రహస్య భేటీలు నిర్వహిస్తున్నాడంటూ ప్రచారం చేయడంతో వివాదం రేగింది. మీడియాను కూడా అనుమతించిన తర్వాత.. ఇక ‘రహస్యం’ ఏమున్నదని.. జనసేన శ్రేణులంతా విరుచుకుపడ్డారు. రహస్యం అనే పదం వాడినందుకు ఆ ఛానెల్ అడ్డంగా దొరికిపోయింది.

కాకపోతే.. ఆ కథనంలో మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. పవన్ తో ‘హై టీ’ అంటూ ఆ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఒక్కొక్కరు కనీసం పదిలక్షల రూపాయలు కట్టిన వారికి మాత్రమే సమావేశానికి ఇన్విటేషన్లు అందాయంటూ ఛానెల్ ఆరోపించింది. కానీ.. దానిని రహస్య సమావేశం అంటూ రంగు పూయడం వల్ల, అదికాస్తా వివాదంగా మారిపోయి… అందులోని ఇతర చందా దందాల ఆరోపణలన్నీ మరుగున పడిపోయాయి.

రాజకీయ నాయకులు భారీ మొత్తాల్లో చందాలు వసూలు చేయడం కొత్త విషయం ఎంతమాత్రమూ కాదు. ఈ ‘హైటీ’ లాంటి కార్యక్రమాలను పెద్దపెద్ద జాతీయ పార్టీలు కూడా నిర్వహిస్తుంటాయి. తెరాస అధినేత కేసీఆర్ పార్టీకోసం కూలి పనులు చేసి డబ్బు సంపాదిస్తుంటారు. ఒకరోజు టీకాచినందుకు పదిహేను లక్షల కూలి, ఒకరోజు ఇస్త్రీ చేసినందుకు పదిలక్షల కూలి… ఇలా వసూలు చేస్తుంటారు.

కాకపోతే… పవన్ కల్యాణ్ ‘హై టీ’ అని పేరు పెట్టారు. ఈ చందాల వ్యవహారాన్ని ఎవ్వరూ తప్పు పట్టడం లేదు గానీ.. ఎంట్రీ ఫీజులాగా నిర్ణయించారని వస్తున్న విమర్శలను బట్టి.. పవన్ తో టీ తాగడానికి పదిలక్షల రూపాయలు చెల్లించాలా? అని ఆశ్చర్యపోతున్నారు. మరి పవర్ స్టారా? మజాకా?pwn7

పవన్ తో టీ తాగాలంటే పదిలక్షలా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share