తెలంగాణలో పవన్ పోటీ ఉత్తుత్తిదే!

October 11, 2018 at 11:23 am

తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీ పోటీచేస్తుందా లేదా? ఈ ప్రశ్న చాలా మంది పవన్ అభిమానుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులైతే తమ జనసేనాని ఏం పిలుపు ఇస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం మేరకు తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీచేయకపోవచ్చు అనే తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కేవలం ఆంద్రప్రదేశ్ రాజకీయం మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తున్న సంగతి. అయితే ఆయన తెదేపా ఆరోపిస్తున్నట్టుగా- భాజపాతో కుమ్మక్కయి రెచ్చిపోయి యాత్ర చేస్తున్నారా? లేదా, తన భాగస్వామ్యంతో ఏర్పడే ప్రభుత్వం వస్తుందనే ఆశతో.. చంద్రబాబునాయుడుతోనే లోపాయికారీగా కుమ్మక్కయి.. వైఎస్సార్ సీపీ ఓటు వ్యాంకును చీల్చడానికి ఈ యాత్రలు సాగిస్తున్నారా? అనే సంగతి ఎవ్వరికీ అర్థం కావడం లేదు.KCR_Pawan_Kalyan_FB_3x2

అంతే తప్ప తెలంగాణ రాజకీయాలను గురించి మాత్రం పవన్ ఎంతమాత్రమూ పట్టించుకోవడం లేదు. పైగా ఈ ఏడాది ప్రారంభంలో ఆయన కేసీఆర్ ను విపరీతంగా కీర్తించారు. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలంటూ హితవు చెప్పారు కూడా. అక్కడితో అయిపోలేదు.. ఆంధ్రప్రదేశ్ లో పోరాట యాత్ర ప్రారంభించిన తర్వాత కూడా.. తెరాసను కీర్తిస్తూనే ఉన్నారు.

తెలంగాణలో వారసత్వ ముఖ్యమంత్ర కావడానికి కేటీఆర్ కు అర్హత ఉన్నదని, ఏపీలో మాత్రం లోకేష్ కు ఆ అర్హత లేదని చెబుతూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అసలు తెలంగాన ఎన్నికల బరిలోకి దిగి, పాలక తెరాసను తూర్పారబట్టడానికి పవన్ కల్యాణ్ కు ధైర్యం ఉన్నదా అనే సందేహాలు పలువురికి కలిగాయి. ఈలోగా, కేసీఆర్ ను ఓడిస్తాం అనే నినాదాన్ని ఎత్తుకున్న సీపీఎం పవన్ తో పొత్తుల కోసం ప్రయత్నించింది. అయితే వారితో కలిసి మాట్లాడడానికి పవన్ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దాంతో ఆయన పోటీచేయరని అంతా అనుకున్నారు.103-64343-1

తీరా ఇప్పుడు ఈనెల 16న పవన్ తెలంగాణ జనసేన పార్టీ మీటింగ్ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ విషయం తేలుస్తారని ఇక్కడి వారు ఆశిస్తున్నారు గానీ.. ఇది సాధారణమైన మీటింగేనని.. ఎన్నికల్లో పోటీ గురించి ప్రస్తావన పెద్దగా ఉండదని , పోటీ కి ఎట్టి పరిస్థితుల్లోనూ దగరని తెలుస్తోంది.

తెలంగాణలో పవన్ పోటీ ఉత్తుత్తిదే!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share