చర్చలకు కూడా పవన్ కు ఖాళీలేదా?

September 8, 2018 at 10:10 am
444333

‘నేను పార్ట్ టైం పొలిటీషియన్ ను కాదు…. ఫుల్ టైం పొలిటీషియన్ నే…’ అని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. కేవలం పాలిటిక్స్ కోసమే తాను సినిమాల్లో నటించడం కూడా మానేసినట్లు, ఆరకంగా ప్రజాసేవకోసం చాలా త్యాగం చేసినట్లు కూడా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండూ తనకు సమాన ప్రాధాన్యం ఉన్న రాష్ట్రాలని.. రెండు రాష్ట్రాల్లోనూ జనసేన శ్రద్ధగా ప్రజలపక్షాన పనిచేస్తుందని ఆయన అంటుంటారు. ఆయన ఇన్ని మాటలు చెబుతున్నా సరే.. వ్యవహారంలో మాత్రం.. పవన్ కల్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ లాగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.39453231_662883840777561_5053048183593107456_n

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముంచుకు రావడం అనేది హఠాత్తుగా గురువారం నాడు చోటుచేసుకున్న పరిణామం కాదు. కొన్ని నెలల నుంచి ఈ పరిణామానినికి సంబంధించిన ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. ఈ ఊహాగానాల మీద ఒక పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ ఏనాడూ స్పందించలేదు సరికదా… ఏ నాటికైనా ఈ పరిస్థితి తప్పదని తెలిసినప్పటికీ పవన్ కల్యాణ్ కనీసం తెలంగాణ లో తన పార్టీ నిర్మాణం గురించి కూడా పట్టించుకోలేదు. ఆంద్రప్రదేశ్ లోని పార్టీకి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ గా ఉన్నదే తప్ప… తెలంగాణలో జనసేన ఇప్పటికీ దిక్కూమొక్కూ లేకుండానే మనుగడ సాగిస్తోంది.

పార్టీ ఇలా కునారిల్లుతున్న సమయంలోనే… తెలంగాణ అసెంబ్లీ రద్దు పర్వం కూడా పూర్తయిపోయింది. ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నట్లే. ఇప్పటికీ తెలంగాణలో పార్టీ వ్యవహారాలు, ఎన్నికల్లో ఏం చేయాలి? భవిష్యత్తు ఏమిటి? అనే విషయాలపై ఇప్పటికీ.. పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి కూడా పవన్ కల్యాణ్ కు ఖాళీ లేదని అర్థమవుతోంది.

తెలంగాణలో జనసేనకు వ్యవస్థీకృత నిర్మాణం లేకపోయినా.. వారి బలం మీద సీపీఎం వారికి కాస్త ఆశ ఉంది. అందుకే పవన్ తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. ఈనెల రెండో తేదీన పవన్ తో భేటీకని వెళ్లిన తమ్మినేనితో మాట్లాడడానికి గానీ, ఆయనతో చర్చించిన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీనుంచి అభిప్రాయం తెలుసుకోవడానికి గానీ పవన్ కల్యాణ్ కు ఇప్పటిదాకా ఖాళీ దొరకలేదని అర్థమవుతోంది.39580558_665022873896991_674917431545692160_n

శుక్రవారం పార్టీ ఇతర నాయకులే.. తెలంగాణ పరిణామాలపై చర్చించారుట. ఈ పరిణామాలతో పాటూ.. సీపీఎం ప్రతిపాదనను కూడా కలిపి పవన్ కు నివేదిస్తారుట. రాజకీయ వాతావరణం ఇంత హాట్ గా ఉన్నప్పుడైనా కనీసం చర్చించడానికి కూడా పవన్ కల్యాణ్ కు వారం రోజులుగా ఖాళీ దొరకడం లేదా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

చర్చలకు కూడా పవన్ కు ఖాళీలేదా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share