పవ‌న్ టంగ్ స్లిప్‌.. అభిమానుల్లో క‌ట్ట‌లు తెగిన ఆవేద‌న‌

June 8, 2018 at 4:12 pm
pawan-toung slip

రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. నాయ‌కులు ఎవ‌రైనా స‌రే.. చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. నాయ‌కు లు ఎవ‌రైనా స‌రే… త‌మ అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌ను బాధ‌పెట్టాల‌ని, టార్గె్ట్ చేయాల‌ని, వారిని అడ్డు పెట్టుకుని రాజ‌కీయా లు చేయాల‌ని చూస్తే.. ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.  ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు కూడా ఎదురైంది. ఆయ‌న చేసిన ఒకే ఒక వ్యాఖ్య‌.. అభిమానుల‌ను తీవ్రంగా క‌ల‌త చెందేలా చేసింది. 

 

అయితే, ఇప్పుడు చేసిన వ్యాఖ్య‌లు భ‌విష్య‌త్తులోనూ రిపీట్ అయితే.. అప్పుడు ఏకంగా ఆయ‌న‌కు గుడ్‌బై చెప్పాల‌ని కూడా అభిమానులు నిర్ణ‌యిం చుకోవ‌డం అంద‌రినీ ఆలోచింప చేసింది. ఇంత‌కీ.. అభిమాన గ‌ణం.. ప‌వ‌న్‌పై ఇలా వ్య‌తిరేక భావ‌న‌ను పెంచుకునేందుకు కార‌ణ‌మైన ఘ‌ట‌న‌పై ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అదికూడా ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ఆయ న ప‌ర్య‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు సాధించి.. ప్ర‌భుత్వంలో కీల‌క చక్రం తిప్పాల‌ని నిర్ణ‌యించుకున్నా రు. మ‌రోప‌క్క‌, తాను నాలుగేళ్లు మ‌ద్ద‌తిచ్చి గెలిపించిన టీడీపీపై తిరుగుబావుటా ఎగుర‌వేశారు. 

 

ఈ క్ర‌మంలోనే ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరును ప్ర‌శ్నిస్తున్నారు. యువ‌త‌కు ఉపాధి చూప‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని బాహాటంగా విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మ‌డుగుల నియోజ‌క‌వ‌ర్గం చీడికాడ మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగించారు. 

 

ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉపాధి చూపించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అందడం లేద‌ని, అందుకే యువ‌త పెడ‌దోవ ప‌డుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ టంగ్ స్లిప్ అయ్యారు. ప్ర‌భుత్వం ఉపాధి చూప‌డంలో విఫ‌లం చెంద‌డం వ‌ల్ల.. యువ‌త గంజాయి ర‌వా ణా చేస్తున్నార‌ని అన్నారు. నిజానికి యువ‌త గంజాయి ర‌వాణా చేస్తున్నార‌న్న ప‌వ‌న్ వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. యువ‌త నేరుగా ప‌వ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

 

ప్ర‌భుత్వం త‌మ‌ను ప‌ట్టించుకోనంత మాత్రాన గంజాయి వంటి సంఘ‌విద్రోహ కార్య‌క్ర‌మాలు చేస్తామ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా ఈప‌రిణామంపై వారు ప‌వ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది త‌మ మ‌నోభావానికి, కేర‌క్ట‌ర్‌కు సంబంధించిన విష‌యంగా వారు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రోసారి ప‌వ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌ని సున్నితంగా హెచ్చ‌రిస్తున్నారు కూడా. మ‌రి ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తాడో చూడాలి. 

పవ‌న్ టంగ్ స్లిప్‌.. అభిమానుల్లో క‌ట్ట‌లు తెగిన ఆవేద‌న‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share