జ‌గ‌న్‌పై ప‌వ‌న్.. తిక్క కామెంట్లు… స‌టైర్లు…!

November 6, 2018 at 4:30 pm

ఒక‌ట‌ని రెండ‌నిపించుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు జ‌న‌సేనాని ప‌వన్‌. ప్ర‌జాస్వామ్యాన్ని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పెట్టేందుకే తాను రాజ‌కీయా ల్లోకి వ‌చ్చాన‌ని చెప్పే ఈ రాజ‌కీయ అప‌ర బుద్ధావ‌తారం.. ప‌సలేని విమ‌ర్శ‌ల‌తో కాలం వెళ్ల‌దీస్తోంద‌ని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం పోరు యాత్ర పేరుతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లో తిరుగుతున్న విష‌యం తెలిసిందే. ఉత్త రాంధ్ర‌లోని జిల్లాల్లో ప‌ర్య‌ట‌న ముగించుకున్న ప‌వ‌న్‌.. ప‌శ్చిమ‌లోనూ చేశారు. ఇప్పుడు తూర్పు గోదావ‌రిలో ప‌ర్య‌టిస్తు న్నా రు. ఈ సంద‌ర్భంగా అవ‌స‌రం ఉన్నా లేకున్నా విమ‌ర్శ‌లు మాత్రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌పైనా ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్టా త్మకంగా ‘ప్రజా సంకల్ప యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే.44569118_2008269292526861_3013280846497972224_n

గ‌త ఏడాది న‌వంబ‌రులో ప్రారంభించిన ఈ యాత్ర మరో నెలరోజుల్లో శ్రీకాకుళం జిల్లాతో ముగియనుంది. జగన్ చేపట్టిన ఈ పాదయాత్రపై ఫస్ట్‌టైం ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విపక్ష నేత అసెంబ్లీకి వెళ్ల కుండా రోడ్లపై తిరుగుతుంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉంటుందా? అని జగన్ పాదయాత్రపై పవన్ షా కింగ్ కామెంట్స్ చేశారు. పెద్దాపురంలో జనసేన బహిరంగ సభలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు, జ‌గ‌న్ అభిమానులు అంతే స్పీడుగా స్పందిస్తున్నారు. ప‌వ‌న్‌కు తిక్క ఎక్కువైంద‌ని అంటున్నారు. ప్ర‌జాస్వామ్యం అనే మాట‌కు అర్ధం తెలుసా? అనే వ్యాఖ్య‌లు కూడా ప‌రుషంగానే వినిపిస్తున్నాయి.

ఏపీ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు… వైసీపీ టికెట్‌పై గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ప‌ప్పుబెల్లాలు కొన్న ట్టుగా కొంటే.. ఆ నాడు బాబుతో జ‌ట్టుక‌ట్టి ఉండి కూడా ఈ విష‌యం ఏంట‌ని? ప్ర‌శ్నించే సాహ‌సం చేయ‌లేని ప‌వ‌న్‌కు ప్ర‌జాస్వామ్యం అనే మాట‌కు విలువ తెలుసా? అని ప్ర‌శ్నిస్తున్నారు. చెమ‌టోడ్చి గ‌త ఎన్నిక‌ల్లో తాను మిన‌హా మిగిలిన 66 మంది అభ్య‌ర్థులను గెలిపించుకున్నారు జ‌గ‌న్. ఇలా గెలిచిన వారిలో తొలిసారి పోటీ చేసిన వారు కూడా ఉన్నారు. కొంద‌రికి అసలు ప్ర‌జ‌ల‌తో సంబంధాలే లేవు. అయినాకూడా జ‌గ‌న్ మొహం చూసి ప్ర‌జ‌లు ఓటేశారు.45588436_710544469344831_6787109102997733376_n

అయితే, వారు ఏరు దాటిన త‌ర్వాత చంద్ర‌బాబు చూపించిన ప‌ప్పుబెల్లాల‌కు ఆశ‌ప‌డి పార్టీ మారిపోయారు. మ‌రి ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఇలా చేయ‌డం స‌రికాద‌ని.. ఆనాడు ప్ర‌శ్నించేందుకు ప‌వ‌న్‌కు నోరు రాలేదా? అనేది నెటి జ‌న్ల మాట‌. పోనీ.. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే..త‌న ఎమ్మెల్య‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వారిని స‌స్పెండ్ చేయాల‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావును అభ్య‌ర్థించారు. విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించారు. అయినా నేటికీ చ‌ర్య లు తీసుకోలేదు. మ‌రి అప్పుడు ప‌వ‌న్‌కు స్పీక‌ర్ వ్య‌వ‌హారం దీని వెనుక చంద్ర‌బాబు ఒత్తిడి ఉన్నాయ‌న్న విష‌యం తెలియ‌లేదా? అది ప్ర‌జాస్వామ్యంలో భాగం కాదా..!

కాల్ మ‌నీ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజాను అన‌వ‌స‌రంగా ఏడాది పాటు క‌క్ష క‌ట్టి మ‌రీ స‌భ నుంచి స‌స్పెండ్ చేసిన‌ప్పుడు ప‌వ‌న్ ఎక్క‌డ ఉన్నాడు? విప‌క్ష నేత హోదాలో జ‌గ‌న్ మాట్లాడాల‌ని అభ్య‌ర్థించినా.. స్పీక‌ర్ నిండు స‌భ‌లో మైక్ క‌ట్ చేసిన‌ప్పుడు ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడ‌డం ప‌వ‌న్కు చేత‌కాలేదు. మ‌రి అలాంటి నాయ‌కుడు ఇప్పుడు వైసీపీ గురించి, వారి పాద‌యాత్ర గురించి మాట్లాడే అర్హత ఎక్క‌డ ఉంటుంది? ఇదీ నెటిజ‌న్ల నిప్పులు. మ‌రి ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

జ‌గ‌న్‌పై ప‌వ‌న్.. తిక్క కామెంట్లు… స‌టైర్లు…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share