కులం అంటే గిట్ట‌దు.. మ‌రి కాపు నేత‌ల‌ను ప‌వ‌న్ ఏం చేస్తాడు?

December 13, 2017 at 4:59 pm
pawan kalyan-TJ1

స‌ర్దుకు పోవ‌డం, వాడుకోవ‌డం, ఈ రెండు సూత్రాల ఆధారంగానే రాజ‌కీయాలు సాగుతున్నాయి. అది కుల‌మైనా, మ‌త‌మైనా.. ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్టాల్సిందే. రంజాన్ వ‌స్తే.. నెత్తిన టోపీ, ప్రార్థ‌న‌లు, క్రిస్మ‌స్ వ‌స్తే.. తెల్ల‌ని వ‌స్త్రం ధ‌రించి బైబిల్ ప‌ట్టుకుని ప్రార్ధ‌న‌లు, ఇక‌, ద‌స‌రా వ‌స్తే.. అమ్మ‌వారికి పట్టు వ‌స్త్రాలు.. నుదుట‌న బొట్టు.. ఇలా రాష్ట్రంలో రాజ‌కీయాలు పండిపోయాయి. అది ఇది అనే తాడే లేకుండా రాజ‌కీయాల కోసం రంగులు మారుస్తున్నారు నేత‌లు. కానీ, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ మాత్రం తాను డిఫ‌రెంట్ అంటూ క‌థ‌లు చెబుతున్నాడు. త‌న‌కు, కులానికీ మ‌ధ్య చాలా దూరం ఉంద‌ని అంటున్నాడు. త‌న‌ను ఒక కులంతో క‌ట్టేయొద్ద‌ని కూడా అంటున్నాడు. నిజానికి రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ఎవ‌రూ ఇలా మాట్లాడ‌రు. 

ఎందుకంటే, నేడు కులం లేనిదే రాజ‌కీయం లేదు. కులాల మాటున చాటుగా చ‌క్క‌బెట్టి ఓట్లు గుద్దించుకుంటున్న నేత‌లున్న ప్ర‌జాస్వామ్యంలో ప‌వ‌న్ వైఖ‌రికి ఏ ఒక్క‌రికీ మింగుడు ప‌డ‌డంలేదు. ఇక‌, ఆయ‌న వైఖ‌రి అలా ఉంటే… ప‌వ‌న్ మ‌నోడు క‌దా.. అంటూ కాపు సంఘాల నాయ‌కులు, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు ఆయ‌న కోసం ఎదురుచూస్తున్నారు. ఆయ‌న ఒక్క‌పిలుపు ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా చొంగ‌కార్చుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎలాగూ పోటీకి సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో తాము ప‌వ‌న్ ప‌క్షం వ‌హిస్తే.. మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు… ప‌వ‌న్‌కు ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. 

మ‌నిషి ఒక‌చోట‌.. మ‌న‌సు ఒక‌చోట అన్న‌ట్టుగా ఆయ‌న టీడీపీలోనే ఉన్నా.. మ‌న‌సు మాత్రం జ‌న‌సేన‌లోనే ఉంది. ప‌వ‌న్ సీఎం అయితే, చూడాల‌ని, త‌న‌కు ఓ శాఖను ద‌క్కేలా చేసుకునేందుకు తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ మూవీ ఏద‌న్నా విడుద‌ల అవుతోందంటే చాలు తెర‌చాటుగా బొండా ఉమా చేయించే హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఇక‌, ఎలూరు ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి కూడా ప‌వ‌న్ అంటే పిచ్చి అభిమానం. ఇక‌, మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా ప‌వ‌న్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. టీడీపీలో బాబు రూల్స్ ఆయ‌న‌కు న‌చ్చ‌డం లేదు. దీనికి తోడు అంటుకున్న అవినీతి మ‌ర‌క‌ల నేప‌థ్యంలో బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తాడో లేదో అనేది కూడా అనుమానంగానే ఉంది. 

దీంతో గంటా కూడా త‌న దారి తాను చూసుకునేందుకు తిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఆయ‌న‌కు ఆశావాద దృక్ఫ‌థంగా క‌నిపిస్తున్నారు. ఇక ఏలూరు ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి గ‌తంలో చిరు పెట్టిన ప్ర‌జారాజ్యంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీ త‌ర‌పున మొన్న ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న ప‌వ‌న్ ఏలూరు వెళ్లిన‌ప్పుడు బుజ్జి ఇంటికి వెళ్లి మ‌రీ వ‌చ్చారు. ఇక‌, బొండా ఉమా.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్రోద్బ‌లంతోనే సీటు ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ నియోజ‌కవ‌ర్గాన్ని.. బీజేపీకి కేటాయించాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, అనూహ్యంగా ప‌వ‌న్ ఒత్తిడి మేర‌కు బొండాకు కేటాయించారు చంద్ర‌బాబు.  , మంత్రి గంటా కూడా గ‌తంలో ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున నేత‌గా ఎదిగిన వ్య‌క్తే. 

ఆ త‌ర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన‌ప్పుడు.. ఆయ‌న కూడా కాంగ్రెస్‌లో చేరి మంత్రి ప‌ద‌విని సంపాయించుకున్నాడు. 2014లో విభ‌జన త‌ర్వాత టీడీపీలో చేరి మ‌రో సారి మంత్రి అయ్యాడు. మొత్తంగా వీరంతా ఇప్పుడు ప‌వ‌న్‌తో మ‌చ్చిక‌గా మెలుగుతుండ‌డాన్ని బ‌ట్టి కులం ప్రాతిప‌దిక‌న ప‌వ‌న్‌ను మెప్పించి మేక‌తోలు క‌ప్పుకొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే, ప‌వ‌న్ మాత్రం త‌న‌కు కులం గిలం లేదంటే ఇలాంటి వారి ప‌రిస్థితి ఏంటి?  వీరంతా రేపు యాంటీ అయితే, ప‌వ‌న్ ప‌ర‌స్థితి ఏంటి? ఇప్పుడు రాజీకీయ వ‌ర్గాల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో కూడా ప్ర‌ధాన అంశంగానే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 

కులం అంటే గిట్ట‌దు.. మ‌రి కాపు నేత‌ల‌ను ప‌వ‌న్ ఏం చేస్తాడు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share