ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ప్రజల విమ‌ర్శ‌లు దాడీ

January 11, 2019 at 11:28 am

చేసిన త‌ప్పుల‌న్ని చేసి గురివింద గింజ‌లా మాట్లాడ‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కే చెల్లుతోంది. గ‌త ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు చంక‌న చేరి ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ ప‌ట్టించి….ఆ త‌ర్వాత ప‌రిణామాలతో విభేధించి…ఇప్పుడు చావు క‌బురు చ‌ల్ల‌గా అన్న‌ట్లుగా…చంద్ర‌బాబు మోసం చేశాడ‌న్న‌ట్లుగా మాట్లాడుతున్నారు..రాజ‌కీయం అంటేనే రంగులు మార్చ‌డం..మాట‌ల‌తో ఏమార్చ‌డం..విచ‌క్ష‌ణ క‌లిగిన నేత‌గా..న‌లుగురికి నాయ‌క‌త్వం వ‌హించేవాడు అవ‌న్నీ క‌నిపెట్టుకుని తిర‌గాల్సిన రోజుల‌ని ఎప్పుడో చాణ‌క్యుడు చెప్పాడు. మ‌రి కోట్లాదిమంది ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాల‌ని గొప్ప ల‌క్ష్యం ఉండ‌ట‌మే కాదు..న‌డ‌వ‌డిక‌..ఆలోచ‌న తీరు తెన్ను కూడా అందుకు అనుగుణంగా ప్ర‌స్పుటించాలి. ప‌వ‌న్లో ఇలాంటి ఏమైనా క‌నిపిస్తున్నాయంటే కోటి రూపాయాల ప్ర‌శ్నేన‌ని చెప్పాలి.49368781_750690278663583_2632914973646389248_n

ఎవ‌రో మోసం చేస్తే మోస‌పోయాన‌ని చెబితే జ‌రిగిన న‌ష్టం…గ‌డిచిన ప్ర‌జ‌ల జీవిత కాలం తిరిగి వెన‌క్కురాదు. ప్ర‌జాజీవితంలో న‌మ్మ‌క‌మే ముఖ్యం. మ‌రి అది ప‌వ‌న్‌క‌ల్యాణ్ రోజురోజుకు పొగుట్టుకుంటున్నార‌న‌డంలో సందేహం లేదు. గ‌తంలో ‘‘2014 ఎన్నికల్లో తెదేపాకు మద్దతిచ్చి ఒక సామాజిక ప్రయోగం చేశా. ఆ ప్రయోగం విజయవంతం కావడం వల్లే జనసేన బలంగా దూసుకుపోయింది. ఎదుటివారిని బలంగా ప్రశ్నించాలంటే నైతిక బలం కావాలి. అందుకే అప్పుడు తెదేపా, భాజపాలకు మద్దతు ఇచ్చి విజయం చేకూరేలా చేశా. అంటూ సొంత డ‌ప్పు కొట్టుకోవ‌డం దేనికి సంకేతం.. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేర‌నే విష‌యాన్ని ప‌వ‌న్ ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే ఆయ‌న‌కు అంత మంచిద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సూచిస్తున్నారు.50095636_750713631994581_7265168916144455680_n

ప‌వ‌న్‌గారు చెప్పేదొక‌టి..మీరు చేసేదొక‌టి..అనేక మార్లు ఈ విష‌యాలు నిరూపిత‌మ‌య్యాయి. జ‌నాల‌కు కూడా మిమ్మ‌ల్ని చూసి విసుగెత్తుతోంది. ఈసడింపులు పెరుగుతున్నాయి..? క‌నీసం అవాయినా గ‌మ‌నిస్తున్నారా..? తీరు మార‌కుంటే మీకు వ్య‌తిరేకంగా బ్యాలెట్ బాక్స్ బ‌ద్ద‌ల‌వడం ఖాయం. నీతులు చెప్పేటోడు కాదు..సేవ చేసేటోడు..మోసం చేయ‌నోడు..ప‌నివంతుడు కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. ప‌నికిమాలిన ముచ్చ‌ట్లు మాని ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తామో చెప్పండి. పార్టీ జెండాను పక్కొండి చేతిలో పెట్ట‌కుండా గ‌ట్టిగా ప‌ట్టుకోవాల‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌కులు సూచిస్తున్నారు. ప‌వ‌న్ మీరు ప్ర‌జా జీవితంలో ఉన్నారు. మీరు తీసుకునే నిర్ణ‌యం ఇత‌రుల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌న్న విష‌యం కాస్త గుర్తు చేసుకోండి.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ప్రజల విమ‌ర్శ‌లు దాడీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share